‘రింకూ’లాంటి ఆటగాడు కావాలి: రోహిత్ శర్మ

ఏ జట్టుకైనా రింకూ సింగ్ లాంటి ఫినిషర్ అవసరమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. రింకూ ఇప్పుడిప్పుడే క్రికెట్ ప్రపంచంలో ఎదుగుతున్నాడని చెప్పారు.

Update: 2024-01-18 07:52 GMT
రింకూ సింగ్, క్రికెటర్

ప్రస్తుతం జట్టుకి రింకూ సింగ్ లాంటి ఫినిషర్ అవసరమని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఓపికగా నిలబడి ఇన్నింగ్స్ నిలబట్టే విలువైన ఆటగాళ్లు ఏ జట్టుకైన అవసరమని, మన దగ్గర ఉన్న అలాంటి ఆటగాడే రింకూ సింగ్ అని అతడిపై హిట్ మ్యాన్ ప్రశంసలు కురిపించాడు.

"గత కొన్ని సిరీస్ నుంచి చూస్తున్నా, అతను అద్భుతంగా ఆడుతున్నాడు. మేము ఏదైతే అతని నుంచి ఆశించామో, అదే చేస్తున్నాడు. తన బలం, బలహీనత రింకూ కు బాగా తెలుసు" అని రోహిత్ అన్నారు. రంగుల జెర్సీలో ఏ ప్రతిభ చూపాడో, అదే ప్రతిభ బ్లూ జెర్సీలో చూపెడుతున్నాడని పరోక్షంగా ఐపీఎల్ లో రింకూ కనబరిచిన ప్రతిభను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

" జట్టు కష్టాల్లో ఉంది. ఓ వైపు ప్రత్యర్థులు అద్భుతమైన బౌలింగ్ తో అప్పటికే నలుగురు బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. మెల్లగా భాగస్వామ్య నిర్మించాలని అనుకున్నాం" అని రోహిత్ చెప్పారు. తీవ్రమైన ఒత్తిడిలో కూడా రింకూ మంచి నెపుణ్యంతో బ్యాటింగ్ చేశారని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చారు. "ఈ రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లు ఎప్పుడో ఒకసారి జరగవు, ఇంతకు ఎప్పుడు జరిగినట్లు నాకు గుర్తులేవు" అని రోహిత్ అన్నారు.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులు సాధించారు. రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు సాధించి ఐదో వికెట్ కు 100 బంతుల్లో 195 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ విజయంతో అప్గాన్ తో జరిగిన మూడు టీ20 సిరీస్ ను భారత్ 3-0 తో కైవసం చేసుకుంది.

మా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాం

భారత్ తో జరిగిన టీ20 సిరీస్ లో మా ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసినట్లు అప్గాన్ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ చెప్పారు. " మా జట్టు ప్రదర్శనపై నాకు సంతోషంగా ఉంది. మేము మంచి క్రికెట్ ఆడాం, అయితే దురదృష్టవశాత్తూ కొన్ని తప్పుల వల్ల సూపర్ ఓవర్ లో సరైన విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాం. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్ కి ఈ అనుభవం ఉపయోగపడుతుంది" అని జద్రాన్ అన్నారు.

భారత్ లో ఎటువంటి జట్టుకైన విజయం అంతతేలికగా దక్కదని పేర్కొన్నారు. మూడు మ్యాచ్ లలో ఉత్తమమైన ఆటను ఆడామని వివరించారు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని ప్రశంసించారు. ఒక్క భాగస్వామ్యంలో ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ సిరీస్ జరిగిన లోపాలను విశ్లేషించుకుని టీ20 వరల్డ్ కప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తామని జద్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News