గుజరాత్: ప్రభుత్వం చూపు బ్రిడ్జిల వైపు

గంభీర వంతెన కూలిపోయిన తరువాత ప్రతి వంతెనపై ప్రజల అనుమానాలు;

Update: 2025-07-13 06:30 GMT
గంభీర వంతెన

వడోదరలోని పద్రాలో మహిసాగర్ నదిపై నిర్మించిన 40 ఏళ్ల నాటి గంభీర వంతెన కూలిపోయి 18 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. గత మూడు సంవత్సరాలలో గుజరాత్ లో జరిగిన రెండో బ్రిడ్జి విషాదం.

ఇంతకుముందు మోర్భీ వంతనె కుప్పకూలీ పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రిడ్జిలు, ప్రమాదకరమైన వంతెనల స్థితిని మరోసారి తెరపైకి తెచ్చింది.

ప్రభుత్వ లెక్కలు అస్పష్టం..
జూన్ 9న జరిగిన ఈ విషాదం నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. నిర్లక్ష్యంగా ఉన్న రోడ్డు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. అయితే రాష్ట్రంలో ఇలాంటి ఎన్ని వంతెనలు ప్రమాదకరంగా ఉన్నాయో మాత్రం ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు చెప్పడం లేదు. రోడ్డు, రవాణాశాఖ వెబ్ సైట్ ప్రకారం.. ప్రస్తుతం గుజరాత్ లో 28 వంతెనలకు మరమ్మతులు జరుగుతున్నాయి. నలుగురు ఇంజనీర్ల సస్పెండ్ కావడంతో వివిధ జిల్లాల అధికారులు తమ ప్రాంతంలోని వంతెనలు తక్షణ మరమ్మతులు అవసరమని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు నెలల క్రితం కచ్ లోని భుజ్ స్థానిక అధికారులు, రుద్రమాత నదిపై నిర్మించిన కొత్త రుద్రమాత-2 వంతెనకు ప్రారంభించారు. కానీ దీనికి ఇప్పుడు మరమ్మతు అవసరమని ఇంజనీర్లు గుర్తించారు. రుద్రమాత-2 నిర్మాణాన్ని చాలా ఆలస్యం తరువాతే చేపట్టారని, కానీ కొత్త వంతెన ప్రారంభమైన ఏడు నెలల్లోనే పగుళ్లు ఏర్పడటం ప్రారంభించిందని వారు చెబుతున్నారు.
మరమ్మతుల భర్తీ సహాయం లేదు..
‘‘60 ఏళ్ల నాటి రుద్రమాత వంతెన మధ్యలో భారీ పగుళ్లు ఏర్పడటం ప్రారంభించింది. జూలై 2023 లో రోడ్డు రవాణా శాఖకు లేఖ రాశాము. వారు వంతెనను పరిశీలించడానికి ఇంజనీర్లను పంపారు. మూడు నెలల్లోపు నివేదికపై చర్య తీసుకోవాల్సి ఉంది.
కానీ నివేదిక జూలై 2024 లో తిరిగి వచ్చింది. రుద్రమాత-2 అనే కొత్త వంతెన పని అదే నెలలో ప్రారంభమైంది. కొత్త వంతెన జనవరి 2025 లో పనిచేయడం ప్రారంభించింది. ఏడు నెలల్లోనే వంతెన మధ్యలో పగుళ్లు ఏర్పడటం ప్రారంభమైంది.
ఇది భుజ్, ఖావ్డాను కలిపే వంతెన కాబట్టి ఉప్పు గనుల నుంచి కర్మాగారాలకు ఉప్పు మోసుకెళ్లే భారీ వాహానాలను రవాణా చేయడానికి ఉపయోగించడంతో మేము ఆందోళన చెందుతున్నాము’’ అని భుజ్ తాలుకా అభివృద్ధి అధికారి ఎస్పీ రాథోడ్ అన్నారు.
50 ఏళ్ల వంతెన..
దక్షిణ గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ లో వాపి జిల్లాను షమ్లాజీ జాతీయ రహదారితో కలిపే కరంజ్ వేరీ గ్రామ సమీపంలోని మాన్ నదిపై ఉన్న 50 ఏళ్ల పురాతన వంతెనపై స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
‘‘మేము మొదట 2019 లో వంతెనను మరమ్మతు చేయమని అధికారులను కోరుతూ ఒక లేఖ రాశాము. ఇది షామ్లాజీ హైవే, వాపీ మధ్య భారీ ట్రాఫిక్ ఉన్న వంతెన. ఈ హైవే వాపిని మహారాష్ట్రతో కలుపుతుంది. అయితే గత ఆరుసంవత్సరాలుగా వంతెన మరమ్మతు కోసం పదేపదే అభ్యర్థించినప్పటికీ మాకు ఎటువంటి స్పందన రాలేదు.
సుమారు 12 రోజుల క్రితం కలెక్టర్ వంతెనపై ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ వాహనాలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న సమయంలో వంతెన కంపించడం ప్రారంభమైంది.
ఇప్పుడు ప్రజలు వాపి చేరుకోవడానికి జంబురి, చందోర్ గ్రామాల మీదుగా అదనంగా 58 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది’’ అని కరేజ్ వేరీ గ్రామ పంచాయతీ సర్పంచ్ శైలేష్ భాయ్ పటేల్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
మరమ్మతు అభ్యర్థనలు..
సౌరాష్ట్రలోని జామ్ నగర్ లోని జునా నాగ్నా గ్రామంలో ఉన్న నవ్నాల్ వంతెనపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెనకు భారీ పగుల్లు ఏర్పడ్డాయి. స్థానిక అధికారులు అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికి ప్రభుత్వం ఇప్పటి వరకూ పనులు ప్రారంభించలేదు.
‘‘రోడ్డు రవాణా శాఖ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. మేము గాంధీనగర్ లోని విభాగానికి లేఖ రాసి ఆరు నెలలు అయింది. వంతెన చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఇది ప్రమాదం జరగడానికి సిద్దమైన పరిస్థితిలో ఉంది. మేము నిరంతరం భయంతో వంతెన ఉపయోగిస్తున్నాము.
ప్రజల అవసరాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు. ఏదైన ప్రమాదం జరిగితే సందర్శించడానికి మాత్రం అధికారులు, నాయకులు సిద్దంగా ఉంటారు’’ అని జూనా నాగానా సర్పంచ్ రమాభాయ్ గజేరా అన్నారు.
ఖోల్వాడ్ వంతెన..
గంభీర వంతెన కూలిపోయిన తరువాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దక్షిణ గుజరాత్ లోని భరుచ్- సూరత్ లను కలిపే అహ్మాదాబాద్- ముంబై మార్గంలోని మరో వంతెన మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో చూసిన విధంగా వంతెన మరమ్మతులకు బదులు ఎలాంటి విషాదం లేకుండా ఉండటానికి తనిఖీ అవసరమని ఒక అధికారి చెప్పారు.
‘‘జూలై 10 నుంచి కామ్రేజ్ లోని తాపి నదీపై ఉన్న ఖోల్వాడ్ వంతెన మరమ్మతుల కోసం 28 రోజుల పాటు మూసివేయబడుతుంది. ట్రాఫిక్ ను ఎక్స్ ప్రేస్ వేలోని కిమ్ టూ ఎనా విభాగం ద్వారా మళ్లిస్తారు’’ అని నేషనల్ హైవే అథారిటీ తెలిపింది.
‘‘సూరత్ లోని కామ్రేజ్ లోని జాతీయ రహదారి -48 లోని తాపి నదిపై ఉన్న వంతెన గత రెండు సంవత్సరాలుగా దెబ్బతింది. తాపి నదిపై ఉన్న వంతెన పట్టుకుని ఉన్న రెండు స్తంభాలను జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు అనేకసార్లు మరమ్మతులు చేశారు.
రెండు స్తంభాలను కలపడానికి ఏడు అడుగుల ఇనుప పలకను అమర్చారు. కానీ దాని కింది భాగం దెబ్బతింటూనే ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది.
మర్మమ్మతులకు బదులు సంబంధిత అధికారులు నుంచి సరైన తనిఖీ అవసరం. రెండు సంవత్సరాల నిరీక్షణ తరువాత ఎన్ హెచ్ఏఐ ఈ విషయాన్ని పట్టించుకున్నందుకు ధన్యవాదాలు’’ అని సూరత్ కలెక్టరేట్ అధికారి ఒకరు అన్నారు.
గంభీర వంతెన గురించి స్థానిక అధికారులు 2023 నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది జనవరిలో రోడ్డు, రవాణా శాఖ చిన్న చిన్న లోపాల కోసం వంతెనను మరమ్మతులు చేసి ప్రజల ఉపయోగం కోసం సురక్షితంగా ఉందని ప్రకటించింది. అయితే మూడు నెలల్లోనే వంతెనపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడి జూలై 9 న కూలిపోయింది.
Tags:    

Similar News