ఇజ్రాయెల్ కి పాక్ రహస్య సందేశం... ఎందుకో తెలుసా..

పాకిస్తాన్ ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తించలేదు. అయినప్పటికీ పాక్ రహస్యంగా యూదు దేశంతో మాత్రం స్నేహం చేయడానికి అర్రులు చాస్తోంది. ఇది చాలాసార్లు బయటపడింది. అయితే నవంబర్ 26,2008లో భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడి జరిగే సందర్భంలోనూ రహస్య సందేశం పంపించిందని అప్పట్లోనే బయటపెట్టింది. భారత ఆర్ధిక రాజధాని ముంబాయికి వెళ్లద్దని, కొంతమంది ఉగ్రవాదులు బృందాలుగా ఏర్పడి దాడుల చేయబోతున్నారంటూ సమాచారం అందించిందట. దీనిని సాధారణ సమాచారంగా టెల్ అవీవ్ భావించినట్లు తెలిసింది. ఈ దాడిలో ఆరుగురు యూదులు మరణించారు. ఈ సంఘటన జరిగి నేటికి సరిగ్గా 15 సంవత్సరాలు పూర్తయ్యాయి.

Producer :  Chepyala Praveen
Update: 2023-11-29 18:37 GMT
ఉగ్రదాడుల్లోని తాజ్ హోటల్

నవంబర్ 26 రాత్రి 9.30 నిమిషాలకు బృందాలుగా ఏర్పడిన పదిమంది లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్ట్ లు మొదట ఛత్రపతి శివాజీ టెర్మినల్ పై దాడి ప్రారంభించారు. తరువాత ముంబాయి దక్షిణ భాగం మొత్తాన్ని గజగజ వణికించారు. రెండు ఆసుపత్రులు, యూదుల ఎక్కువగా ఉండే నారిమన్ హౌజ్, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ట్రైడెంట్ హోటల్, తాజ్ హోటల్ , ఓ కాఫీ షాప్ ఇలా జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నా ప్రాంతాలపై ఏకే -47, హ్యండ్ గ్రనెడ్ లతో దాడులు చేసి సామాన్య ప్రజానీకాన్ని అమానుషంగా అంతమొందించారు.

నాలుగు రోజుల పాటు ఈ దాడులు జరిగాయి. దాదాపు 300 మందిని తీవ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. దాడుల్లో 166 మంది సాధారణ ప్రజలు 20 మంది భద్రతా దళ సిబ్బంది మరణించారు. నవంబర్ 28 న ఎన్ఎస్జీ బృందాలు తమ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇందులో 9 మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయి.

తుకారం ఓంబ్లే అనే ముంబాయి పోలీస్ తన సాహసంతో తీవ్రవాది అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నాడు. తరువాత విచారణలోనే కసబ్ ది పాకిస్తాన్ లోని పంజాబ్ అని తేలింది. 2010లో కసబ్ కు ఉరిశిక్ష విధించగా, రెండు సంవత్సరాల తరువాత పుణే కారాగారంలో దీనిని అమలు చేశారు. ఈ దాడులతో అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారు.

ఉగ్రవాద దాడులకు ఏం పరిష్కారం

పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద దాడులకు భారత్ ఓ కొత్త సైనిక విధానాన్నిరూపొందించింది. దీనిని కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ గా పేర్కొంటున్నారు. 2001 డిసెంబర్ 13 న పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. దాంతో అప్పటి వాజ్ పేయ్ సర్కార్ ఆపరేషన్ పరాక్రమ్ ని ప్రారంభించింది. సైన్యాన్ని భారీగా సరిహద్దులకు తరలించింది.

అయితే ప్రధాన కోర్ దళాన్ని సరిహద్దులకు తరలించడానికి దాదాపు 40 రోజులు పట్టింది. ఈ లోపు పాకిస్తాన్ సైతం తన సైన్యాన్ని సరిహద్దులకు తరలించింది. శత్రువుని సర్ ప్రైజ్ అటాక్ చేసే అవకాశం ఇందులో లేకపోవడంతో అప్పటికి అనుసరిస్తున్న యుద్ద వ్యూహాన్ని భారత్ సమీక్షించింది. అప్పుడే ఆపరేషన్ కోల్డ్ స్టార్ట్ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. దాదాపు ఒక దశాబ్ధం పాటు వీటిని అనేక యద్ద విన్యాసాల్లో సాధన చేసి ఫలితాలను బేరీజు వేసుకుంది. తరువాత ఈ విధానాన్ని సైన్యంలో ప్రవేశపెట్టినట్లు అధికారికంగా అప్పటి జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు.

కోల్డ్ స్టార్ట్ లో ఏం జరుగుతుంది

కోల్డ్ స్టార్ట్ లో ఐబీజీలు అనబడే సైనిక గ్రూప్ ఉంటుంది. దీనిలో 3000 వేల నుంచి 5000 వేల వరకూ సైనికులుంటారు.  వీటిలో భారీ స్థాయిలో ఆయుధాలు, మెషీనరీలు, ట్యాంకులు, పోరాట వాహనాలు ఉంటాయి. ఇవి పాక్ సరిహద్దు లోని రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రధాన ప్రాంతాల్లో మొహరిస్తారు. ఆదేశాలు అందిన క్షణాల్లో ఇవి పాకిస్తాన్ పై దాడి చేసి ఆ దేశ ప్రాదేశిక వ్యవస్థల్ని ధ్వంసం చేసి 48 గంటల్లో తిరిగి వెనక్కి వస్తాయి. ప్రస్తుతం ఈ ఐబీజీలు చైనా సరిహద్దులకు సైతం తరలించారు.

Tags:    

Similar News