‘కద్వా పాటిదార్ల’ కోసం బీజేపీ ఏదైనా చేస్తుందా?

బీజేపీ దేశంలో దశాబ్ధకాలంగా అధికారం చలాయిస్తుంది. అంతకుముందు గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ సీఎంగా ఉన్న మోదీ తరువాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సక్సెస్ అయ్యారు.

Update: 2024-02-22 09:38 GMT
గుజరాత్ ముఖ్యమంత్రి, భూపేంద్ర పటేల్

గుజరాత్ లో వరుసగా కమలదళం అధికారంలోకి రావడానికి కారణం మత సమీకరణాలతో పాటు పటేల్ లేదా పాటిదార్ సామాజికవర్గ అండదండలే కారణం. అందులో ముఖ్యంగా సంపన్న పాటిదార్ వర్గమైన కద్వా లంటే బీజేపీకి అమితమైన ప్రేమ.

గుజరాత్ లో కద్వా పాటిదార్ వర్గం వాటా దాదాపు 15 శాతం ఉంటుంది. అందుకే గుజరాత్ లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వీరి మద్థతు కీలకం. తాజాగా ఈసంస్థ నిర్వహించిన ఓ సమావేశానికి ఏకంగా సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. ‘విశ్వ్ ఉమియా ఫౌండేషన్’(VUF)అనే కద్వా పాటిదార్ సంస్థ నిర్వహించిన కంగారూ కోర్టు ఉమైయా దర్భార్ కే సీఎం హజరయ్యారు.

ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అహ్మాదాబాద్ లో ఉంది. పటేళ్ల సామాజిక, మతపరమైన అభ్యున్నతికి ఇది కృషి చేస్తుంది. పంచాయతీ వ్యవస్థ నమూనాపై ఆధారపడిన ఈ న్యాయస్థానం, సంఘ సభ్యుల మధ్య వివాదాలను న్యాయస్థానం తీసుకెళ్లడం కంటే ముందే పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే వీయూఎఫ్ కేవలం కద్వా వర్గం వారు మాత్రమే పెట్టుకున్న సంస్థ. ఇది పాటిదార్ లోని ఒక ఉపకులం. పాటిదార్ లో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. దీనిలోని మరో వర్గం పేరు లెయువా. కద్వాలు మాత్రమే 15 శాతం వరకూ ఉండి రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలరు. ఇవే కాకుండా పటేళ్ల వర్గంలో మరోరెండు ఉపకులాలు ఉన్నాయి. వాటిలో అంజనలు, చౌధరీలు.

అయితే కద్వాలు వజ్రాలు, వస్త్ర వ్యాపారవేత్తలుగా ఉన్నారు. లెయూవాలో భూ యజమానులు, అంటే ఎక్కువ సంఖ్యలో రైతులుగా స్థిరపడ్డారు. మాజీ సీఎంలు అయినా కేశూభాయ్ పటేల్, ఆనందీబెన్ పటేల్ మాజీ ఆర్థిక మంత్రి సౌరవ్ పటేల్ లెయూవా వర్గానికి చెందిన వారు. కద్వాలు ఎప్పుడు ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ రాజకీయంగా పదవులను ఆశించలేదు.

రిజర్వేషన్ల ఉద్యమం

బీజేపీ ఓటు బ్యాంకుగా ఉన్న కద్వా పాటిదార్లు 2016 తరువాత పాటిదార్ ఆందోళనలో భాగమయ్యారు. కద్వా పాటిదార్ హర్దిక్ పటేల్, పాటిదార్ అనామత్ ఆందోళనను ఉరకలెత్తించడంతో చాలామంది పాటిదార్లు బీజేపీకి దూరమయ్యారు. తమకు రిజర్వేషన్ల తో పాటు రాజకీయంగా ఉన్నత పదవులు కావాలని డిమాండ్ చేశారు.

ఇదే అంశంపై గుజరాత్ విశ్లేషకుడు మణిహి జానీ మాట్లాడుతూ " 2017 నాటి ఎన్నికల్లో బీజేపీ పాటిదార్ల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసింది. దానివల్ల ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం 99 సీట్లకే పరిమితం అయింది. తరువాత వీరికి తగిన హామీలు ఇవ్వడంతో 2022 ఎన్నికల్లో 150 మార్క్ ను దాటగలిగింది " అని విశ్లేషించారు. ఇందులో మొదటిది ఈడబ్ల్యూఎస్ కోటా కింద వారికి విద్యలో పది శాతం రిజర్వేషన్ కల్పించడం మొదటిదని చెప్పారు.

తరువాత సీఎంగా భూపేంద్ర పటేల్, రుషికేష్ పటేల్ ను ఆరోగ్య మంత్రిగా తీసుకురావడంతో ఉద్యమం శాంతించిదని వివరించారు . ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా పాటిదార్లను బీజేపీ చిన్నచూపు చూడట్లేదని చెప్పడానికి ఈసమావేశాలకు సీఎం హాజరుకావడం ఒక ఉదాహరణగా చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.

నిధుల కేటాయింపు

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం జామ్ నగర్ జిల్లాలో గల కద్వా పాటిదార్ ప్రార్థన స్థలం ఉమియాధామ్ అభివృద్ధికి రూ. 18 కోట్లను మంజూరు చేసింది. మరో ముఖ్యమైన విషయం.. ప్రేమ పెళ్లిల్లో తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని మెహసానాలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

పటేళ్ల మద్ధతు చరిత్ర

గత నలభై సంవత్సరాలుగా అంటే 1984- 85 నుంచి బీజేపీకి వీరు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. అంతకుముందు మాధవ సింగ్ సోలంకీ హయాం వరకూ ఉత్తర గుజరాత్ లో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉండేది. నాలుగు సార్లు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. ఆయన ఖస్త్రీయ, హరిజన్, ఆదివాసీ, ముస్లింలను ఏకంగా చేసి రాజకీయంగా అధికారంలోకి కొనసాగారు.

దీనివల్ల కొన్ని కులాలు రాజకీయంగా ప్రాధాన్యం కొల్పోయాయి. అందులో ఒక కులమే పాటిదార్లు. దాంతో వీరు అప్పటి నుంచి బీజేపీకి విధేయత చూపుతున్నారు. అహ్మదాబాద్ కు చెందిన మాజీ ప్రొఫెసర్ రాజకీయ విశ్లేషకుడు గౌతమ్ షా మాట్లాడుతూ.. పటేల్ల మద్ధతు లేకుండా మీరు గుజరాత్ ను గెలవలేరు. 2019 స్థానిక ఎన్నికల సందర్భంగా ఆప్ ఇక్కడికి వచ్చినప్పటికీ గొప్పగా ప్రభావం చూపలేదు. కద్వా పాటిదార్లు ఆర్థికంగా శక్తిమంతులు, గుజరాత్ లో అతిపెద్ద కుల ఓటు బ్యాంకు. వీరిని కాదని ముందుకు వెళ్లలేరని అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News