రిజర్వేషన్లు ఇవ్వకపోతే ముంబాయిని ముట్టడిస్తాం? మరాఠ ఉద్యమకారులు

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే ముంబాయిలోని ఆజాద్ మైదానంలో దీక్షకు దిగుతామని ఉద్యమకారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Update: 2024-01-27 08:00 GMT

విద్యా, ఉద్యోగాలలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే దక్షిణ ముంబాయిలోని ఆజాద్ మైదానంలో నిరసన దీక్షకు దిగుతామని ఆ కోటా నాయకుడు మనోజ్ జరాంగే ప్రకటించాడు. అదేగనక జరిగితే ముంబాయి ప్రజారవాణా వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉందని, పోలీసులు, ప్రభుత్వం హడలిపోతున్నారు.

ముంబాయిలో ప్రతిరోజు 65 నుంచి 70 లక్షల మంది ప్రజలు వివిధ అవసరాలకు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అవి పరిమితికి మించి వాడుతున్నారని, రిజర్వేషన్ల కోసం వచ్చే మద్దతుదారులు కూడా కలిస్తే అది పూర్తిగా కుప్పకూలుతుందని అంచనాలున్నాయి.

ప్రభుత్వం ఇప్పటికే మరాఠా నాయకుడు జరాంగేతో చర్చలు జరుపుతోంది. వెంటనే ఆయనను శాంతింప చేసి ఆందోళనను ఆపాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు తెలిపిందుకు ఓ ప్రతినిధి బృందాన్ని జరాంగే వద్దకు పంపింది.

ప్రభుత్వప్రతినిధులతో చర్చలు జరిగాయని, వారు ఇచ్చిన పత్రాలు, హమీలను కూలంకషంగా పరిశీలిస్తున్నామని వాటి అధ్యయనం ముగిసిన తరువాత తన స్పందన తెలియజేస్తామని నవీముంబైలోని శివాజీ పార్క్ లో వేచిఉన్న తన మద్దతుదారులను ఉద్దేశించి జరాంగే ప్రసంగించారు.

ఏది ఏమైన రిజర్వేషన్లు పొందె వరకూ కూడా ఉద్యమం ఆగేది లేదని ప్రకటించారు. జరాంగే తో సహ మరాఠా ఉద్యమకారులు, టెంపోలు, జీబులు, కార్లు, ట్రక్కులతో నవీముంబాయిలోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీకి చేరుకున్నారు.

ఇదే విషయం పై మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కార్ మాట్లాడుతూ "తమ ప్రభుత్వం రిజర్వేషన్లు అంగీకరించిది. ఇప్పటికే ప్రభుత్వం 37 లక్షల మంది మరాఠాలకు ఓబీసీ సర్టిఫికెట్లు అందజేసింది. త్వరలోనే వాటిసంఖ్య 50 లక్షలకు చేరుకుంటుంది" అని ఆయన ప్రకటించారు.

ఇదే అంశం పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోమంత్రి కూడా అయిన దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలుపుకోవచ్చని, అయితే నిబంధనలు పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని కోరారు.

మరోవైపు క్రిమినల్ ప్రోసిజర్ కోడ్ సెక్షన్ 149 ప్రకారం మనోజ్ జరాంగేకు నోటీసులు జారీ చేశారు. ముంబాయి దేశ ఆర్థిక రాజధాని, వివిధ అంతర్జాతీయ సంస్థలు, మరికొన్ని ఆర్ధిక సంస్థలు పని చేస్తున్నాయి. అందువల్ల మీకు ఆందోళన చేయడానికి అనుమతి ఇవ్వట్లేదు అని నోటీసులో పేర్కొన్నారు. అయితే వీటిని మరాఠ ఉద్యమకారులు పట్టించుకోలేదు.

మరాఠలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ "ప్రభుత్వం కావాలనే సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తోంది.

రాజ్యాంగంలో రిజర్వేషన్ లపై ఉన్న 50 శాతం కోటాను తొలగించి మరాఠాలకు హక్కులు కల్పించాలి. ఆందోళనలలో ఏదైన నష్టం జరిగితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించకతప్పదు" అని హెచ్చరించారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. ప్రభుత్వం జారేంజ్ తో పాటు మరాఠ వర్గాన్ని కూడా రైడ్ కు తీసుకెళ్తోందని విమర్శించారు. 

Tags:    

Similar News