UPలో మేల్ టైలర్లు, బార్బర్లపై నిషేధం !

"బ్యాడ్ టచ్" నిరోధించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నది రాష్ట్ర మహిళా కమిషన్ వాదన.

Update: 2024-11-10 08:54 GMT
యూపీ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్‌తో బబితా చౌహాన్..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్ కొత్త ప్రతిపాదన తెరమీదుకు తెస్తోంది. ఇకపై రాష్ట్రంలో మగ టైలర్లు, బార్బర్లు మహిళలకు సేవలందించరాదన్న ప్రతిపాదనను బబితా చౌహాన్ నేతృత్వంలోని కమిషన్ తర్వలో తేబోతుంది. "బ్యాడ్ టచ్" నిరోధించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నది రాష్ట్ర మహిళా కమిషన్ వాదన. ఇక జిమ్‌ల్లో కూడా మహిళా శిక్షకులనే నియమించుకోవాలని, మగ శిక్షకులకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేయనున్నారు. అయితే ఈ సిఫార్సులు మహిళల హక్కులు, భద్రత, ఉద్యోగ వివక్షకు దారితీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘క్యాపిటల్ బీట్‌’పై చర్చ

ది ఫెడరల్ ‘క్యాపిటల్ బీట్’ లెటెస్ట్ ఎపిసోడ్‌లో మహిళా హక్కుల కార్యకర్త తాహెరా హసన్, రాజకీయ విశ్లేషకుడు సిద్ధార్థ్ శర్మ, సీనియర్ జర్నలిస్ట్ సునీతా ఆరోన్‌ తమ అభిప్రాయాలను హోస్ట్ నీలు వ్యాస్‌తో పంచుకున్నారు. ఈ ప్రతిపాదనతో ప్రాక్టికాలిటీ, ప్రేరణ, సామాజిక ప్రభావం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

‘రాజకీయ ప్రేరేపితం’

కమిషన్ ప్రతిపాదనపై సునీతా ఆరోన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది "రాజకీయ ప్రేరేపితమని" మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలాగా అనిపించడం లేదన్నారు. ఈ తరహా ప్రతిపాదనలు మైనారిటీ కమ్యూనిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. యూపీలో చాలా మంది టైలర్లు, బార్బర్లు పనిచేస్తున్నారని, ఈ ప్రతిపాదన సామాజిక విభజనను మరింత తీవ్రం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

‘ప్రతిపాదన అనవసరం’

మహిళా హక్కుల కార్యకర్త తాహెరా హసన్ ప్రతిపాదనను నియంతృత్వ ప్రతిపాదనగా అభివర్ణించారు. అసలు ఇది అనవసరం అని పేర్కొ్నారు. తమ సర్వీస్ ప్రొవైడర్లను ఎన్నుకునే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని పట్టుబట్టారు. నిషేధాలు విధించడం కంటే.. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా చట్టాలను అమలు చేయడం, ప్రజా భద్రతను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.

రాజకీయ వ్యూహం..

రాజకీయ విశ్లేషకుడు సిద్ధార్థ్ శర్మ ప్రతిపాదనను అంగీకరించారు. మహిళల భద్రతకు పరిష్కారం కనుగొనడం కంటే నిర్దిష్ట ఓటర్లను ఆకర్షించేలా ప్రతిపాదన ఉందని అభిప్రాయపడ్డారు.

ఆచరణలో ఇబ్బందులు..

ప్రతిపాదన అమల్లోకి వస్తే చిన్న వ్యాపారాల యజమానులు ఎదుర్కొనే సవాళ్లను కూడా విమర్శకులు ఎత్తి చూపారు. మహిళా సిబ్బందిని నియమించుకోవడం వల్ల ఆర్థిక భారం, మహిళల భద్రతకు హామీ ఇవ్వకుండానే ప్రతిపాదన తేవడం మంచిదికాదన్నారు.

‘మహిళల భద్రతకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి’

జెండర్ బెస్డ్ సేవలకు బదులుగా మహిళల భద్రతకు అవసరమైన చట్టాలు చేపట్టాలని వాదించారు. ఈ నిర్బంధ చర్యలు రానున్న కాలంలో చట్టంగా మారతాయా? లేక మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News