ఛాంపియన్స్ ట్రోఫీ కామెంటేటర్స్ ఎవరంటే..
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి 9 భాషల్లో కామెంటరీ ఉండబోతుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్‍తో పాక్ తలపడుతుంది.;
మినీ వరల్డ్ కప్‌గా పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి పాకిస్తాన్‌లో ప్రారంభమైంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా టోర్నీ సాగనుంది. టీమ్‌ఇండియా మాత్రం తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడబోతోంది.
కరాచీ వేదికగా..
కరాచీలోని నేషనల్ స్టేడియంలో నేడు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్‍తో పాకిస్థాన్ తలపడుతుంది. 50 ఓవర్ల టోర్నమెంట్‌లో 8 జట్లు, 2 గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. సొంతగడ్డపై చాలా ఏళ్ల తర్వాత టోర్నీ జరుగుతుండటంతో సత్తాచాటాలని ఉవిల్లూరుతోంది మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాక్.
ఇక కామెంటేటర్స్ విషయానికొస్తే..
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాతలు(Commentators) ICC TV ద్వారా ఈ టోర్నమెంట్‌ను విశ్లేషించనున్నారు. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, నెట్‌వర్క్ 18 టీవీ చానెల్స్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.
లైవ్ స్ట్రీమింగ్..
ఇక అన్ని మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచనుంది JioStar. తెలుగుతో కలిపి 9 భాషల్లో కామెంటరీ ఉంటుంది. వ్యాఖ్యాతల విషయానికొస్తే..
ఇంగ్లీష్ వ్యాఖ్యాతలు..
సునీల్ గవాస్కర్, నాసర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్, రవి శాస్త్రి, ఆరోన్ ఫించ్, డేల్ స్టెయిన్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, మెల్ జోన్స్, వసీం అక్రం, హర్ష భోగ్లే, మైఖేల్ అథర్టన్, మ్పుమెలెలో బంగ్వా, కాస్ నాయిడూ, సైమన్ డౌల్, బజీద్ ఖాన్, దినేష్ కార్తీక్, కేటీ మార్టిన్, షాన్ పొలాక్, అతార్ అలీ ఖాన్, ఇయాన్ వార్డ్.
బెంగాలీలో..
శ్రీవత్స్ గోస్వామి, సంజీబ్ ముఖర్జియా, శతీర జాకిర్ జెస్సీ, శిలాదిత్య చటర్జీ, గౌతమ్ భట్టాచార్య, ఆర్.ఆర్. కౌశిక్ వరుణ్, సుభోమోయ్ దాస్.
భోజ్‌పురిలో..
సౌరభ్ కుమార్, గులామ్ హుస్సేన్, సుమిత్ మిశ్రా, సత్యప్రకాశ్ కె, ఆశుతోష్ అమన్, శివమ్ సింగ్, మని మేరాజ్.
హర్యాన్వీలో..
మన్విందర్ బిస్లా, అనిల్ చౌధరి, విశ్వాస్, కృష్ణన్ శర్మ, సోను శర్మ, సుమిత్ నర్వాల్.
హిందీలో..
సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, సంజయ్ మంజ్రేకర్, వకార్ యూనిస్, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, మహ్మద్ కైఫ్, వహాబ్ రియాజ్, పియూష్ చావ్లా, సంజయ్ బంగార్, ఆకాష్ చోప్రా, దీప్ దాస్‌గుప్తా.
కన్నడలో..
వెంకటేష్ ప్రసాద్, జె సుచిత్, సునిల్ జోషి, భరత్ చిప్లీ, విజయ్ భరద్వాజ్, పవన్ దేశ్పాండే, శ్రీనివాస మూర్తి, అఖిల్ బాలచంద్ర.
మరాఠీలో..
కేదార్ జాధవ్, ఆదిత్య తారే, చైతన్య సంతోష్, నీలేష్ నటు.
తమిళంలో..
అనిరుద్ధ శ్రీకాంత్, అభినవ్ ముఖుంద్, కె శ్రీకాంత్, ముతురామన్, కెవి సత్యనారాయణన్, మురళి విజయ్, యోమహేష్ విజయకుమార్, ఎస్ బద్రినాథ్, శ్రీరామ్ ఎస్, సదగోపన్ రమేష్, ఆర్ శ్రీధర్, అశ్వత్ ముకుందన్.
ఇక తెలుగులో..
హనుమ విహారి, ఆర్ శ్రీధర్, ఎంఎస్‌కే ప్రసాద్, టి సుమన్, ఆశిష్ రెడ్డి, అక్షత్ రెడ్డి, ఎన్‌సి కౌశిక్, కల్యాణ్ కృష్ణ.