ఛాంపియన్స్ ట్రోఫి: భారత్ - పాక్ లో ఎవరిని విజయం వరిస్తుంది?

హర్ధిక్ పాండ్యా జట్టుకు సమతూకం తీసుకొస్తాడని విశ్లేషణ;

Update: 2025-02-23 06:58 GMT

క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఇంకా కొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా జరగబోతోంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి -2025 లో భాగంగా ఈ మ్యాచ్ జరగుతుంది.

ఇందులో భావోద్వేగాలు మిళితం కావడంతో రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ అద్భుతమైన ప్రదర్శన ఉంటుందని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. క్రికెట్ విశ్లేషకుడు బాస్కి ‘ది ఫెడరల్’ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

భారత్ - పాకిస్తాన్ శత్రుత్వం క్రికెట్ కు అతీతంగా ఉండదు. మైదానంలో ఇరుజట్లు యుద్దరంగంలో ఉన్నట్లుగానే భావిస్తారు. ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. దీనిని జయించడానికి ప్రయత్నాలు చేస్తారు.

టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ తీసుకోవాలని, ఇండియా దాదాపు 250 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజయం తథ్యమని అన్నారు. పాకిస్తాన్ ను ఒత్తిడి గురి చేయాలని సూచించారు.
‘‘పాకిస్తాన్ ఎల్లప్పూడు ఒత్తిడిలో కూలిపోతారు’’ అని వ్యాఖ్యానించారు. ఎక్కువ మొత్తంలో స్కోర్ బోర్డుపై పరుగులు ఉన్నప్పుడూ పాకిస్తాన్ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. దాని గత చరిత్రను చూస్తే ఇదే తెలుస్తుందని అన్నారు.
మ్యాచ్ టెన్షన్..
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్ ప్రపంచానికి పాకింది. మైదానంలో జరిగే పోటీలకు ప్రేక్షకుల ఉత్సాహభరితమైన వాతావరణం ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. మైదానంలో తీసుకునే ప్రతి వ్యూహాత్మక నిర్ణయాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ ఆటకంటే ఎక్కువ చేస్తుంది.
రెండు జట్లు విపరీతమైన ఒత్తిడి అనుభవిస్తున్నాయి. టీమిండియా తన దూకుడు కొనసాగిస్తూ ఉండగా, పాకిస్తాన్ మాత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. అయితే దుబాయ్ లో మ్యాచ్ జరుగుతుండగా అక్కడ పరిస్థితులు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇక్కడ స్వింగ్, స్పిన్ కు స్వల్పంగా సహాయపడే పిచ్ ఉంటుంది. నైపుణ్యం కలిగిన బౌలర్లను అనుకూలంగా ఉండవచ్చు. ఇటువంటి అంశాలు పాకిస్తాన్ పై ఒత్తిడిని పెంచుతాయని భావిస్తున్నారు.
స్పిన్ బౌలింగ్ దాడి..
స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి పాక్ బ్యాట్స్ మెన్లకు సవాల్ విసరగలడని అన్నారు. మిడిల్ ఓవర్లలో పరుగుల కట్టడి, వికెట్లు తీయడానికి ఉపయోగపడతారు.
వరుణ్ చక్రవర్తిని మ్యాచ్ విన్నర్ గా బాస్కీ అభివర్ణించారు. పాకిస్తాన్ ను మొదటి బంతి నుంచి వరుణ్ కలవర పెట్టగలడని అన్నారు. వరుణ్ ను మాస్టర్ ట్రంప్ కార్డ్ అని అభిప్రాయపడ్డారు. వైవిధ్యమైన బంతులకు, లైన్ అండ్ లెంగ్త్ జత చేసి బంతులు వేయడం వలన ప్రత్యర్థికి లయ దొరకకుండా చేయడంలో ఈ మిస్టరీ స్పిన్నర్ దిట్ట అన్నారు.
ఆ ఆటగాళ్లతో సమతూకం..
మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసి ఘనత హర్దిక్ పాండ్యాకు ఉందని బాస్కీ అన్నారు. జట్టుకు సమతూకం తీసుకురావడంలో పాండ్యా కీలకపాత్ర పోషిస్తున్నాడని అన్నారు.
బంతి, బ్యాట్, ఫీల్డింగ్ చురుకైన పాత్ర పోషించే పాండ్యా ఒత్తిడి పరిస్థితుల్లో కీలకంగా మారే అవకాశం ఉందన్నారు. మైదానంలో పాండ్యా ప్రసెన్స్ జట్టుకు అదనపు ప్రయోజనం తీసుకువస్తుందని అన్నారు.
విరాట్ కోహ్లి, బాబర్ ఆజాం మధ్య పోలీకలకు ఆస్కారం లేదననారు. కోహ్లి టాప్ క్లాస్ బ్యాటింగ్, స్థిరత్వం సాటిలేనివిగా ఉన్నాయి. పాక్ అనగానే కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్ లు ఆడతారు.
టాస్ గెలవడం ఇన్నింగ్స్ కు కీలకమని అన్నారు. భారత్ ముందుగా బ్యాటింగ్ చేయడం ద్వారా వ్యూహాత్మక ప్రయోజనం లభిస్తుందని అన్నారు. ప్రారంభ ఓవర్లలో కాస్త నిదానంగా బ్యాటింగ్ చేయడం ద్వారా వికెట్లను కాపాడుకుంటే భారీ స్కోర్ నమోదు చేయవచ్చని అన్నారు. ఛేదన చేయడం వారికి కష్టంగా ఉంటుందని వివరించారు.
మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు ఈజీగా 280 పరుగులు సాధిస్తుందని అన్నారు. ఇది తదుపరి బ్యాటింగ్ చేసే జట్టుకు భారంగా మారుతుందన్నారు. చాలాకాలం తరువాత మైదానంలో అడుగుపెట్టిన షమీ.. క్రితం మ్యాచ్ లో తన ఫామ్ ను అందుకోవడం జట్టుకు ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రారంభ ఓవర్లలతో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని హడల్ గొడుతున్నాడని, అయితే డెత్ ఓవర్లలో సైతం ఇదే ఒరవడిని కొనసాగించాలని అన్నారు. హర్షిత్ రాణా ప్లేసులో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకువస్తారని అంచనా వేశారు.
Tags:    

Similar News