ఐపీఎల్ -2025 షెడ్యూల్ విడుదల, కేకేఆర్ తో తలపడనున్న ఆర్సీబీ

కోల్ కతలోనే ప్రారంభం.. అక్కడే ఫైనల్;

Update: 2025-02-17 05:35 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 18 వ సీజన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సీజన్ మార్చి 22న ప్రారంభమై మే 25న విడుదల చేస్తుంది. ఈ సారి 13 వేదికల్లో మ్యాచులను నిర్వహించనున్నాయి. మూడు ఫ్రాంచైజీలు తాము ఎంపిక చేసుకున్న రెండో హోం గ్రౌండ్ లో ఆడనున్నాయి.

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కత నైట్ రైడర్స్(కేకేఆర్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) మధ్య జరిగే మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. మే 25 కోల్ కతలోనే ఫైనల్ తో ముగుస్తుంది.
ఎంతో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ లో మార్చి 23న, ఏప్రిల్ 20న తేదీలలో జరగనుంది.
13 వేదికలు, 12 డబుల్ హెడర్లు..
ఒక షెడ్యూల్ 12 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉంటాయి. ఈ మ్యాచ్ లన్నీ 65 రోజుల పాటు 13 వేదికలలో జరుగుతాయి. ధర్మశాల, గౌహతి, విశాఖ పట్నంలో ఒక్కొక్క వేదికలో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.
ఎప్పటిలాగే ధర్మశాల, పంజాబ్ కింగ్స్ కు రెండో సొంతమైదానం లాగా పని చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్ తమ జైపూర్ తో పాటు గౌహాతిని తమ రెండో హోం గ్రౌండ్ గా ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నాన్ని తమ రెండో హోంగ్రౌండ్ గా చేసుకున్నారు. మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ తో అక్కడ తమ లీగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. గౌహతి, విశాఖపట్నం రెండు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుండగా, ధర్మశాల మూడు మ్యాచ్ లను నిర్వహిస్తుంది.
హైదరాబాద్, కోల్ కతలో ప్లే ఆఫ్ లు
ఈ సీజన్ లో తొలి డబుల్ - హెడర్ మ్యాచ్ మార్చి 23న హైదరాబాద్ లో జరుగుతుంది. దీనిలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తో మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో తలపడుతుంది. ఆ తరువాత చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
లీగ్ దశ తరువాత ప్లేఆఫ్ లు హైదరాబాద్, కోల్ కతలో జరుగుతాయి. మే 20, మే 21 తేదీలలో వరుసగా క్వాలి ఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగుతాయి. మే 23న, క్వాలిఫైయర్ 2 కోసం మ్యాచ్ కోల్ కతకు మారుతుంది.
2022 లో పది జట్లకు ఫార్మాట్ విస్తరణ తరువాత ఐపీఎల్ రెండు గ్రూపుల్లో జరుగుతోంది. కోల్ కత నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఒక గ్రూపులో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మరో గ్రూపులో ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర జట్లతో రెండు సార్లు ఆడుతుంది.
Tags:    

Similar News