Hyderabad || డ్రంకన్ డ్రైవ్‌లో ఇంతమంది తాగుబోతులు దొరికారా..!
హైదరాబాదులో ఒక్క రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌ల కేసులు మాత్రం హజార్ మార్క్ దాటేశాయి.;
న్యూఇయర్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు లెక్కచేయలేదు. హైదరాబాద్‌లో ఎప్పటిలాగానే రెచ్చిపోయారు డ్రంకెన్ డ్రైవర్స్. రాత్రి పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1184 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక జోన్‌ల వారిగా చూస్తే. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179 కేసులు.. సౌత్ వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్ట్‌లో రీడింగ్ 550 పాయింట్స్ చూపించింది. అంటే అతను ఏ స్థాయిలో తాగాడో మనకు అర్థం అవుతుంది. నాంపల్లిలో కొందరు ఆటోవాలాలు హంగామా సృష్టించారు. ఫుల్‌గా తాగి రోడ్లపై హల్‌చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేశారు. బహదూర్‌పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తన బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీర్‌చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు. మందు తాగి దొరికిన వారి వాహనాలు సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. హయత్‌నగర్‌లో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు యువకులు. మరోవైపు నగరవ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి రోడ్డెక్కిన మందుబాబులు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌కు నిరాకరించిన ఓ మందుబాబు పరుగుల తీశాడు. అతన్ని వెంటపడి పట్టుకున్నారు పోలీసులు.