
ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.
లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.
Live Updates
- 13 Feb 2026 9:53 AM IST
ములుగులో మూడు స్థానాలు హస్తం హవా
- ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది.
- 1వ, 4వ, 6వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
- అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ గెలుపొందారు.
- ఇతర వార్డుల ఫలితాలు వరుసగా వెలువడుతున్నాయి.
- 13 Feb 2026 9:53 AM IST
కాంగ్రెస్ పార్టీ దూకుడు
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు
4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం
5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం
6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం
7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం
- 13 Feb 2026 9:52 AM IST
గద్వాల జిల్లా కౌంటింగ్ అప్ డేట్
గద్వాల జిల్లా కౌంటింగ్ అప్ డేట్
17 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 23..
కాంగ్రెస్. 05
బిజెపి. 17
బిఆర్ఎస్. O
ఇండిపెండెంట్. 01
30 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 7..
కాంగ్రెస్. 01
బిజెపి. 02
బిఆర్ఎస్. 02
సిపిఐ. 01
ఇండిపెండెంట్. 01.
6 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 48..
కాంగ్రెస్. 19
బిజెపి. 29.
36 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 05..
కాంగ్రెస్. 02
బిజెపి. 01
బిఆర్ఎస్. 02.
37 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 02..
బిజెపి. 01
బిఆర్ఎస్. 01
31 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 02..
కాంగ్రెస్. 02
32 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 08..
కాంగ్రెస్. 03
బిజెపి. 01
బిఆర్ఎస్. 02
ఇండిపెండెంట్. 02
34 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 07..
బిజెపి. 06
నోట. 01
35 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 02
కాంగ్రెస్. 01.
బిజెపి. 01
33వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 03
బిజెపి. 03.
1వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 05
కాంగ్రెస్. 01
బిఆర్ఎస్. 03
ఇండిపెండెంట్. 01
2 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 22
కాంగ్రెస్. 13
బిఆర్ఎస్. 09
3 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 07
కాంగ్రెస్. 03
బిఆర్ఎస్. 03
బిజెపి. 01
5 వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 04
కాంగ్రెస్. 01
బిఆర్ఎస్. 02
ఇండిపెండెంట్ 01
6వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 56
కాంగ్రెస్. 19
బిఆర్ఎస్. 02
బిజెపి. 29
ఇండిపెండెంట్ 01
7వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 03
కాంగ్రెస్. 02
బిఆర్ఎస్. 01
9వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 05
కాంగ్రెస్. 02
బిజెపి. 03
8వ వార్డు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 04
బిఆర్ఎస్. 01
బిజెపి. 01
ఇండిపెండెంట్. 02
- 13 Feb 2026 9:52 AM IST
ఎల్లంపేట విజేతలు వీరే
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడవుతున్నాయి.
- 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత గెలుపొందారు.
- 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సద్ది సురేశ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
- ఇంకా ఇతర వార్డుల ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నాయి.
- 13 Feb 2026 9:51 AM IST
ఎల్లంపేటలో బీఆర్ఎస్ ముందంజ..
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరుసగా వార్డుల ఫలితాలను అధికారులు ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మూడు వార్డుల్లో విజయం దక్కింది.
- 10వ వార్డులో శ్రీలత రమేష్ గెలుపొందారు.
- 12వ వార్డులో కల్పన మాణిక్య రావు విజయం సాధించారు.
- 16వ వార్డులో సురేష్ రెడ్డి గెలిచారు.
- కాంగ్రెస్ పార్టీ రెండు వార్డుల్లో ఖాతా తెరిచింది.
- 1వ వార్డులో మామిళ్ళ బాలమణి గెలుపొందారు.
- 15వ వార్డులో వేణు గౌడ్ విజయం నమోదు చేశారు.
- మిగతా వార్డుల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.
- 13 Feb 2026 9:50 AM IST
భువనగిరి 1వ వార్డులో కాంగ్రెస్ విజయం
- యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడుతున్నాయి.
- 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి గెలుపొందారు.
- ఇంకా ఇతర వార్డుల ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నాయి.
- 13 Feb 2026 9:50 AM IST
హుజురాబాద్ లో హైడ్రామా
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళం పగలగొట్టాల్సి వచ్చింది. దీనితో కౌంటింగ్ ఆలస్యం అయింది. స్ట్రాంగ్ రూమ్ ఇన్ చార్జి అధికారి కరీంనగర్లోని తన ఇంటి వద్ద మర్చిపోవడంతో గత్యంతరం లేక ఇనుప రాడ్తో తాళం చెవి పగలగొట్టాల్సి వచ్చింది. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గాయబ్ పై అభ్యర్థుల ఆగ్రహం
మందకొడిగా కౌంటింగ్ ప్రారంభం!
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు ఎనిమిదిన్నర వరకు కూడా ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు, ఏజెంట్లు అసహనం వ్యక్తం చేశారు. తొమ్మిది దాటిన పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు ఏజెంట్లు..
- 13 Feb 2026 9:49 AM IST
మధిరలో టీడీపీ బోణీ
- ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఫలితాల్లో టీడీపీ గెలిచింది.
- 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి గెలుపొందారు.
- ఈ ఫలితంతో మధిరలో టీడీపీ ఖాతా ప్రారంభమైంది.
- 13 Feb 2026 9:48 AM IST
మొయినాబాద్ లో కాంగ్రెస్ గెలుపు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల తొలి ఫలితం
మొయినాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విక్రం రెడ్డి (కాంగ్రెస్) విజయం
- 13 Feb 2026 9:47 AM IST
షాద్ నగర్ మున్సిపల్ కౌంటింగ్ అప్ డేట్
షాద్ నగర్ మున్సిపల్ కౌంటింగ్
తొలి రౌండ్ లో బ్యాలెట్ లెక్కింపు వార్డులు ఇవే..
కాంగ్రెస్ -9 ఓట్లు
బిఆర్ఎస్ - 14 ఓట్లు
బిజెపి - 2ఓట్లు
ఇండిపెండెంట్ -1
చెల్లనిది - 1
1. వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ కు ఒక ఓటు
3, వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ యాదవ్ కు ఒక ఓటు
5, వ వార్డు సింగపాగ శిరీష కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు,
టిఆర్ఎస్ పార్టీ చెందిన అశ్వినికి ఒక ఓటు
7,వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ కు 3ఓట్లు
టిఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ రాజుకు 6 ఓట్లు
9,వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోదా మాధవులకు 1 ఓటు
మరొకటి చెల్లని ఓటు
11,వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి పిల్లి శారదకు రెండు ఓట్లు
17,వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాజియా బేగం సర్వర్ పాషాకు ఒక ఓటు
19,వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని పాలమాకుల విజయలక్ష్మి కు ఒక ఓటు
21,వ వార్డు లేవు
23,వ వార్డు బిజెపి అభ్యర్థిని పద్మ సాయిరాంకు ఒక ఓటు
25,వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి నకల వెంకటేష్ కు ఒక ఓటు
కాంగ్రెస్ అభ్యర్థి పెంటయ్యకు ఒక ఓటు
27 వార్డుల ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ అభ్యర్థి మురళీమోహన్ అప్పికి ఒక ఓటు
బిజెపి అభ్యర్థి మంగ విజయ్ కు ఒక ఓటు
టిఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి శంకర్ కు ఆరు ఓట్లు
బ్యాలెట్ ఓట్లను ప్రకటించిన ఎన్నికల అధికారిని సునీతరెడ్డి.

