ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 10:21 AM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర స్థాయి ఫలితాలు

    మొత్తం: 2,582

    ప్రకటించినవి: 233

    కాంగ్రెస్: 135

    బీఆర్ఎస్: 73

    బీజేపీ: 17

    ఇతరులు: 16

  • 13 Feb 2026 10:20 AM IST

    దేవరకొండలో స్వతంత్ర అభ్యర్థి విజయం

    నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలోని 19వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ విజయం సాధించారు.

  • 13 Feb 2026 10:18 AM IST

    మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధిక్యం

    • మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ హవా కనిపిస్తోంది. మూడు మున్సిపాలిటీల్లో కలిపి 13 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది.
    • ఎల్లంపేట మున్సిపాలిటీలో మొత్తం 7 వార్డుల్లో బీఆర్ఎస్ 4 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 3 వార్డుల్లో గెలిచింది.
    • అలియాబాద్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీఆర్ఎస్ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 1 సీటు, బీజేపీ 1 సీటు, ఇండిపెండెంట్ 1 సీటు సాధించారు.
    • మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 7 వార్డుల్లో బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం నమోదు చేసింది.
    • జిల్లాలో బీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది.

  • 13 Feb 2026 10:17 AM IST

    నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో

    • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది.
    • నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది.
    • మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 11 వార్డుల్లో విజయం సాధించింది.
    • ఈ ఫలితంతో నందికొండలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం చాటింది.

  • 13 Feb 2026 10:16 AM IST

    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రస్ హవా

    130 వార్డుల్లో హస్తం విజయం. బీజేపీ17, బీఆర్ఎస్ 60, ఇతరులు పది వార్డుల్లో విజయం సాధించారు.

  • 13 Feb 2026 10:06 AM IST

    ములుగులో కాంగ్రెస్ ఆధిక్యం..

    ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రెండు వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.

    • 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పద్మ 278 ఓట్లతో గెలిచారు.
    • 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ 67 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
    • 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వసంత 212 ఓట్లతో గెలుపొందారు.
    • 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పావని 21 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమెకు 367 ఓట్లు వచ్చాయి.
    • 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దివ్య 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
    • 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ 6 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
    • 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత విజయం నమోదు చేశారు.

  • 13 Feb 2026 10:03 AM IST

    హుస్నాబాద్‌లో కాంగ్రెస్ వరుస విజయాలు

    • హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది.
    • ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4, 5, 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
    • 4వ వార్డులో పిల్లి తిరుపతి విజయం సాధించారు.
    • 5వ వార్డులో బొలిశెట్టి రాజు గెలుపొందారు.
    • 6వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం నమోదు చేశారు.
    • 7వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ గెలిచారు.
    • ఇంకా మిగతా వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉన్నాయి.

  • 13 Feb 2026 10:03 AM IST

    గడ్డపోతారం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ కైవసం

    • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిపత్యం చాటింది.
    • మొత్తం 18 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 వార్డుల్లో విజయం సాధించింది.
    • కాంగ్రెస్ పార్టీ మూడు వార్డుల్లో గెలుపొందింది.
    • ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు.
    • ఈ ఫలితంతో గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆధీనంలోకి వెళ్లింది.

  • 13 Feb 2026 9:59 AM IST

    ఎల్లంపేట్‌లో బీఆర్ఎస్‌కు రెండు వార్డులు

    • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడవుతున్నాయి.
    • 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత గెలుపొందారు.
    • 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సద్ది సురేశ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
    • ఇంకా ఇతర వార్డుల ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నాయి.

  • 13 Feb 2026 9:58 AM IST

    గడ్డ పొతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం


    సంగారెడ్డి జిల్లా గడ్డ పొతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

    ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్

    మున్సిపాలిటీ వార్డులలో 10 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 1 కాంగ్రెస్ అభ్యర్థి విజయం.


    జిన్నారం మండలంలోని గడ్డపోతారం గత ఏడాది జనవరిలో మున్సిపాలిటీగా ఏర్పాటు అయింది. అప్పటివరకు గ్రామ పంచాయతీ గా ఉండింది. కాజిపల్లి, గడ్డపోతారం, వావిలాల, లక్ష్మీపతి గూడెం, మాదారం గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు.

Read More
Next Story