ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 10:32 AM IST

    లక్సెట్టి పేటలో గొడవ

    మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం

    మూడో వార్డుకు సంబంధించి రెండు బ్యాలెట్ బాక్స్ లకు కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన

    కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వాదం

    కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్

  • 13 Feb 2026 10:31 AM IST

    జగిత్యాల జిల్లాలో మిశ్రమ ఫలితాలు

    జగిత్యాల జిల్లాలోని రాయికల్, జగిత్యాల మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. పలు పార్టీలకు విజయాలు దక్కాయి.

    రాయికల్ మున్సిపాలిటీ:

    10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ గంగ లక్ష్మి గెలుపొందారు.

    1వ వార్డులో బీజేపీ అభ్యర్థి తోపారపు ప్రశాంతి విజయం సాధించారు.

    4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సౌజన్య గెలిచారు.

    7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లతిక విజయం నమోదు చేశారు.

    జగిత్యాల మున్సిపాలిటీ:

    43వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సమిండ్ల వాణి గెలుపొందారు.

    16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ విజయం సాధించారు.

    46వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అనీష్ కుతేజా గెలిచారు.

    7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి రాము విజయం నమోదు చేశారు.

    28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి భైరనేని భాగ్య గెలుపొందారు.

    జిల్లాలో పలు పార్టీలకు మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.

  • 13 Feb 2026 10:31 AM IST

    అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో

    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం చాటింది.
    • మొత్తం 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 వార్డుల్లో విజయం సాధించింది.
    • బీఆర్ఎస్ 2 వార్డులు దక్కించుకుంది.
    • బీజేపీ ఒక వార్డులో గెలుపొందింది.
    • ఈ ఫలితంతో అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది.

  • 13 Feb 2026 10:28 AM IST

    ఆదిలాబాద్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజ.. సంగారెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లో 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజ

  • 13 Feb 2026 10:28 AM IST

     రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ.. 36 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.. బీఆర్ఎస్ 17, బీజేపీ 9, ఇతరులు రెండుచోట్ల గెలుపు

  • 13 Feb 2026 10:27 AM IST

    తూప్రాన్ మున్సిపాలిటీ అప్డేట్

    తూప్రాన్ మున్సిపాలిటీ

     7th ward:  50 ఓట్లతో బీజేపీ మన్నె స్వామి విజయం,

    1st ward:  బొంది రజిని BRS 34 ఓట్లతో విజయం,

    4th ward: BRS జైపాల్ రాథోడ్,88 ఓట్లతో  విజయం.

    15 వ వార్డు:  గుప్తా కాంగ్రెస్ 295 ఓట్లతో విజయం.

    10 th ward: BRS మునిరాతి లక్ష్మి196 ఓట్లతో  విజయం

  • 13 Feb 2026 10:27 AM IST

    భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం..

    ఈ మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే 15 వార్డుల్లో విజయం సాధించారు.

  • 13 Feb 2026 10:26 AM IST

    మధిరలో కాంగ్రెస్ వరుస గెలుపులు

    • ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది.
    • 1వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 8వ వార్డు, 11వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
    • 10వ వార్డులో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.
    • మధిరలో ఇప్పటివరకు కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది.

  • 13 Feb 2026 10:23 AM IST

    వేములవాడ అప్డేట్

    రాజన్న సిరిసిల్ల జిల్లా.వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం వార్డులు : 28

    పోస్టల్ బ్యాలెట్

    కాంగ్రెస్ పార్టీ : 27

    బిఆర్ఎస్ పార్టీ : 33

    బిజెపి పార్టీ : 13

    ఇతరులు : 02

    రిజెక్ట్:03

  • 13 Feb 2026 10:22 AM IST

    నందికొండపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం

    • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది.
    • నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది.
    • మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 11 వార్డుల్లో విజయం సాధించింది.
    • ఈ ఫలితంతో నందికొండలో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిపత్యం చాటింది.

Read More
Next Story