ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 10:56 AM IST

    సూర్యాపేట లో హంగ్ భయం... అపుడే క్యాంపులు మొదలు

    సూర్యాపేట లో హంగ్ భయం...

    -ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు BRS కౌన్సిలర్ లు గైరాహాజర్.

    -వారందరిని హైదరాబాద్ క్యాంపు లో ఉంచినట్లు అనుమానం.

    -సూర్యాపేట మున్సిపాలిటీ లో హాంగ్ రావొచ్చంటు నాయకుల అంచనాలు. అందువల్ల రిజల్ట్ తర్వాత ఫిరాయింపులు ఉంటాయని అనుమానం

    -అధికార పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందన్న భయంతో కౌన్సిలర్ అభ్యర్థులను బిఆర్ ఎస్ పార్టలీ  క్యాంపుకు తరలించినట్లు చెబుతున్నారు.

  • 13 Feb 2026 10:40 AM IST

    కల్వకుర్తిలో కాంగ్రెస్‌కు రెండు సీట్లు

    నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఫలితాలు ప్రకటిస్తున్నారు.

    16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లలితమ్మ గెలుపొందారు.

    7వ వార్డులో హస్తం అభ్యర్థి రత్నమాల విజయం సాధించారు.

    కల్వకుర్తిలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది.

  • 13 Feb 2026 10:37 AM IST

    హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా

    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం ఏడు వార్డుల్లో హస్తం అభ్యర్థులు విజయాలు నమోదు చేశారు.

    • 1వ వార్డులో చెన్నమనేని అనూష విద్యాసాగర్ గెలుపొందారు.
    • 2వ వార్డులో బూరుగు లత కిస్టస్వామి విజయం సాధించారు.
    • 3వ వార్డులో కొండ రజిత సత్యనారాయణ ఆధిక్యం సాధించారు.
    • 4వ వార్డులో పిల్లి తిరుపతి గెలిచారు.
    • 5వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం నమోదు చేశారు.
    • 6వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ గెలుపొందారు.
    • 7వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం సాధించారు.

    హుస్నాబాద్‌లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తోంది.

  • 13 Feb 2026 10:36 AM IST

    మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర స్థాయి ఫలితాలు

    తెలంగాణా మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర స్థాయి ఫలితాలు (వార్డులు)

    మొత్తం: 2,582

    ప్రకటించినవి: 357

    కాంగ్రెస్: 196

    బీఆర్ఎస్: 112

    బీజేపీ: 29

    ఇతరులు: 20

  • 13 Feb 2026 10:36 AM IST

    హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో

    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది.

    నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది.

    మొత్తం 12 వార్డులకు గానూ ఇప్పటికే 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

    మిగతా వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉన్నాయి.

  • 13 Feb 2026 10:34 AM IST

    గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో

    బీఆర్ఎస్ మరో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిసింది.

    మొత్తం 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 4 వార్డులు దక్కించుకుంది. బీజేపీ 2 స్థానాల్లో గెలిచింది. ఇతరులు ఒక వార్డు గెలుపొందారు.

    ఇప్పటికే గడ్డపోతారం మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్, గుమ్మడిదలతో తన ఆధిక్యాన్ని మరింత బలపరిచింది.

  • 13 Feb 2026 10:34 AM IST

    ఏదులాపురంలో కాంగ్రెస్ వరుస విజయాలు

    ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చాటింది.

    1, 3, 4, 7, 8, 9, 20, 25, 29 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

    ఈ ఫలితాలతో ఏదులాపురంలో కాంగ్రెస్ బలమైన స్థితిని నమోదు చేసింది.

  • 13 Feb 2026 10:33 AM IST

    దేవరకద్రలో మిశ్రమ ఫలితాలు

    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడవుతున్నాయి.

    • 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
    • 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
    • 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలిచారు.
    • దేవరకద్రలో మూడు ప్రధాన పార్టీలకు ఒక్కో వార్డు దక్కింది.

  • 13 Feb 2026 10:33 AM IST

    అలియాబాద్ మున్సిపాలిటీ అప్డేట్

    మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ముందంజలో బీఆర్ఎస్

    మొత్తం 7 వార్డులకు గాను

    4 వార్డుల్లో బీఆర్ఎస్

    1 వార్డులో కాంగ్రెస్

    1 వార్డులో బీజేపీ

    1 వార్డులో ఇండిపెండెంట్ విజయం

  • 13 Feb 2026 10:33 AM IST

    ఆత్మకూర్‌లో కాంగ్రెస్–బీజేపీ పోటీ

    వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపల్ ఎన్నికల్లో కీలక వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

    • 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతయ్య గెలుపొందారు.
    • 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నల్లగొండ శ్రీనివాసులు విజయం సాధించారు.
    • 3వ వార్డులో బీజేపీ అభ్యర్థి చెట్ల లలిత గెలిచారు.
    • 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాగమణి విజయం నమోదు చేశారు.
    • 8వ వార్డులో బీజేపీ అభ్యర్థి జిందే జ్యోతి శ్రీనివాసులు గెలుపొందారు.
    • ఆత్మకూర్‌లో రెండు పార్టీలకు సమాన స్థాయిలో విజయాలు దక్కాయి.

Read More
Next Story