
ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.
లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.
Live Updates
- 13 Feb 2026 11:13 AM IST
నేరేడుచర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది.
మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 9 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది.
బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలిచింది.
ఒక స్థానంలో ఇతర అభ్యర్థి విజయం సాధించారు.
ఈ ఫలితంతో నేరేడుచర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది.
- 13 Feb 2026 11:10 AM IST
భీంగల్‌లో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య పోటీ
నిజమాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు వార్డుల ఫలితాలు వెలువడ్డాయి.
- 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తోట సతీష్ గెలుపొందారు.
- 7వ వార్డులో కాంగ్రెస్ తరఫున అంజు మాలి విజయం సాధించారు.
- 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గున్నాల బాలలత గెలిచారు.
- 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అనుపమ విజయం నమోదు చేశారు.
మిగతా వార్డుల ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నాయి.
- 13 Feb 2026 11:07 AM IST
చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఘన విజయం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో విశేష ఫలితం నమోదైంది.
1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ గెలుపొందారు.
తాజా లెక్కింపులో 102 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఈ ఫలితంతో చిట్యాలలో ప్రత్యేక గుర్తింపు దక్కింది.
- 13 Feb 2026 11:06 AM IST
మెట్‌పల్లిలో తొలి రౌండ్ మిశ్రమ ఫలితాలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో తొమ్మిది వార్డుల ఫలితాలు వెలువడ్డాయి.
ఈ రౌండ్‌లో కాంగ్రెస్ 3 స్థానాలు దక్కించుకుంది.
బీజేపీ కూడా 3 వార్డుల్లో గెలిచింది.
బీఆర్ఎస్ 2 స్థానాలు సాధించింది.
ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం నమోదు చేశారు.
ఇప్పటికే రెండో రౌండ్‌లో మరో తొమ్మిది వార్డుల లెక్కింపు ప్రారంభమైంది.
- 13 Feb 2026 11:05 AM IST
కోహీర్‌లో కాంగ్రెస్ ముందంజ
సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీ ఫలితాలు ప్రకటించారు.
మొత్తం 16 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంది.
బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలిచింది.
బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానాన్ని సాధించారు.
కోహీర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టమైంది.
- 13 Feb 2026 11:05 AM IST
నారాయణపేటలో తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
నారాయణపేట మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది.
మొత్తం 8 వార్డులకు గాను 5 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఒక వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.
మరొక వార్డులో బీఆర్ఎస్ గెలిచింది.
ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యం నమోదు చేశారు.
మిగతా రౌండ్ల లెక్కింపు కొనసాగుతోంది.
- 13 Feb 2026 11:04 AM IST
డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
మొత్తం 15 వార్డులకు జరిగిన పోటీలో 11 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది.
మిగిలిన 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ ఫలితంతో డోర్నకల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధించింది.
- 13 Feb 2026 11:04 AM IST
సుల్తానాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఆధిపత్యం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.
మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
బీజేపీ, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డులో విజయం నమోదు చేశారు.
ఈ ఫలితంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది.
- 13 Feb 2026 11:03 AM IST
మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చాటింది.
మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది.
బీఆర్ఎస్ 6 వార్డులు దక్కించుకోగా, ఒక వార్డులో ఇతర అభ్యర్థి విజయం సాధించారు.
ఈ ఫలితంతో మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతికి వెళ్లింది.
- 13 Feb 2026 11:02 AM IST
అయిజ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆధీనంలోకి
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
కాంగ్రెస్ 6 వార్డులను దక్కించుకుంది.
ఈ ఫలితంతో ఐజ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పట్టు సాధించింది.

