
ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.
లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.
Live Updates
- 13 Feb 2026 11:31 AM IST
హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది.
మొత్తం 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
బీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలిచింది.
ఇతర అభ్యర్థులు 5 స్థానాలు దక్కించుకున్నారు.
ఈ ఫలితంతో హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతికి వెళ్లింది.
- 13 Feb 2026 11:30 AM IST
బోణీ కొట్టిన జాగృతి
కవిత మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తన బలాన్ని చాటుకుంది. వడ్డే మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి బోణీ కొట్టింది. 10 స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) విజయం సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో వార్డును దక్కించుకున్నాయి.
- 13 Feb 2026 11:26 AM IST
కామారెడ్డిలో మూడు పార్టీలకు తొలి విజయాలు
కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల ఖాతాలు తెరుచుకున్నాయి.
34వ వార్డులో బీజేపీ అభ్యర్థి సుజాత విజయం సాధించారు.
32వ వార్డులో కాంగ్రెస్ తరఫున అఖిల గెలుపొందారు.
31వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం నమోదు చేశారు.
కామారెడ్డిలో మూడు పార్టీలూ తమ తమ ఖాతాలు ప్రారంభించాయి.
- 13 Feb 2026 11:24 AM IST
సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మొత్తం 15 వార్డుల్లో 12 స్థానాలు హస్తం ఖాతాలో చేరాయి.
1వ వార్డులో ఈర్ల స్వరూప, 2వ వార్డులో గాజుల రాజమల్లు, 4వ వార్డులో బిరుదు కృష్ణ, 5వ వార్డులో గరిగే శోభారాణి, 6వ వార్డులో బాకం సాయి కిరణ్, 7వ వార్డులో వర ప్రదీప్ గెలుపొందారు.
8వ వార్డులో చింతల రాజు, 9వ వార్డులో టికే ప్రభాకర్, 10వ వార్డులో అంతటి పుష్పలత విజయం సాధించారు. 13వ వార్డులో సిద్ధ తిరుపతి, 14వ వార్డులో వేగోళం పద్మ, 15వ వార్డులో గాదాసు మంజుల గెలిచారు.
3వ వార్డులో కందునూరి సమత బీజేపీ తరఫున విజయం నమోదు చేశారు. 11వ వార్డులో కల్వల శంకరమ్మ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 12వ వార్డులో అమీరిశెట్టి శ్రావణి AIFBP నుంచి విజయం సాధించారు.
ఈ ఫలితంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది.
- 13 Feb 2026 11:24 AM IST
మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టం
మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు చెందిన మొత్తం 68 వార్డుల్లో ఇప్పటివరకు 29 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి.
ఈ దశలో బీఆర్ఎస్ 19 స్థానాలు దక్కించుకుని ముందంజలో ఉంది. కాంగ్రెస్ 7 వార్డులు గెలిచింది. బీజేపీ 2 స్థానాలు సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం నమోదు చేశారు.
ఎల్లంపేట మున్సిపాలిటీ:
బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 వార్డుల్లో గెలిచాయి.
అలియాబాద్ మున్సిపాలిటీ:
బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ:
బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 2 వార్డుల్లో గెలుపొందింది.
జిల్లాలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతోంది.
- 13 Feb 2026 11:22 AM IST
తొర్రూర్‌లో బీఆర్ఎస్ గెలుపు
మహబూబాబాద్ మున్సిపాలలిటీ బీఆర్ఎస్ వశమయింది. మొత్తం 16 వార్డుల్్లో బీఆర్ఎస్ 9 వార్డులను సొంతం చేసుకుంది. కాంగ్రస్ ఆరు వార్డుల్లో విజయం సాధించింది.
- 13 Feb 2026 11:21 AM IST
నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో పీఠాన్ని దక్కించుకుంది.
మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 11 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 3 వార్డులు, బీజేపీ ఒక వార్డు సాధించాయి.
1వ వార్డులో పత్రి లలిత బీజేపీ తరఫున 198 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 3వ వార్డులో స్వప్న అభిషేక్ షెట్కార్, 7వ వార్డులో విజయ్ బుజ్జి, 15వ వార్డులో రూబినా నజీబ్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయం సాధించారు.
మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిపత్యం చాటారు. 6వ వార్డులో భగవాన్ లక్మాన్ 203 ఓట్ల మెజారిటీ సాధించారు. 4వ వార్డులో దారం శంకర్ 23 ఓట్ల తేడాతో గెలిచారు. 14వ వార్డులో సాజియా తరనుమ్ 52 ఓట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేశారు.
ఇతర వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఫలితంతో నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతికి వెళ్లింది.
- 13 Feb 2026 11:21 AM IST
సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మొత్తం 15 వార్డుల్లో 12 స్థానాలు హస్తం ఖాతాలో చేరాయి.
1వ వార్డులో ఈర్ల స్వరూప, 2వ వార్డులో గాజుల రాజమల్లు గెలుపొందారు. 4, 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం నమోదు చేశారు.
3వ వార్డులో కందునూరి సమత బీజేపీ తరఫున గెలిచారు. 11వ వార్డులో కల్వల శంకరమ్మ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 12వ వార్డులో అమీరిశెట్టి శ్రావణి AIFBP తరఫున గెలుపొందారు.
ఈ ఫలితంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది.
- 13 Feb 2026 11:20 AM IST
మునిసిపాలిటీ వార్డుల్లో కాంగ్రెస్ హవా
మొత్తం 2581 మున్సిపాలి వార్డుల్లో 886 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
కాంగ్రెస్ 503,
బీఆర్ఎస్ 252,
బీజేపీ 61,
ఇతరులు 70 స్థానాల్లో విజయం సాధించారు.
- 13 Feb 2026 11:18 AM IST
దేవరకద్రలో హంగ్ ఫలితం
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి దక్కలేదు.
మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 స్థానాలు సాధించింది.
బీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలిచింది.
బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది.
ఇతర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.
దేవరకద్రలో మెజారిటీ లేకపోవడంతో తదుపరి సమీకరణాలపై దృష్టి నిలిచింది.

