ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 12:16 PM IST

    నల్గొండ జిల్లా హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్

    మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ, డోర్నకల్ మునిప్రాలిటీ కాంగ్రెస్ కైవసం

    పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం

    భట్టి విక్రమార్క ఇలాకా మధిర మున్సిపాలిటీలో సైతం ఎగిరిన కాంగ్రెస్ జెండా

  • 13 Feb 2026 12:15 PM IST

    మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభంజనం..

    మధిర మున్సిపాలిటీ...

    మొత్తం వార్డులు..22

    కాంగ్రెస్..11 విజయం

    బిఆర్ఎస్..0

    బిజెపి ..0

    • 1వ వార్డు దోర్నాల శిరీష కాంగ్రెస్
    • 2వ వార్డు బాణావత్ వెంకట రమణ కాంగ్రెస్
    • 3వ వార్డ్ బెజ్జం రాజు కాంగ్రెస్
    • 4వ వార్డు సామినేని సుజాత కాంగ్రెస్
    • 5వ వార్డు పిల్లి సునీత కాంగ్రెస్
    • 6వ వార్డు వేమిరెడ్డి లక్ష్మి కాంగ్రెస్
    • 7వ వార్డు శీలం నర్సిరెడ్డి కాంగ్రెస్
    • 8వ వార్డు యన్నం కోటేశ్వరరావు కాంగ్రెస్
    • 9వ వార్డు ఎర్రందాసు చారులత కాంగ్రెస్
    • 10వ వార్డు బోడెపూడి రేవతి కాంగ్రెస్ కూటమి
    • 11వ వార్డు గద్దల మాధురి కాంగ్రెస్

    మొదటి రౌండ్లో 11 వార్డుల్లో కౌంటింగ్ జరగగా 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

  • 13 Feb 2026 12:14 PM IST

    కల్లూరులోనూ కాంగ్రెస్ దూకుడు

    ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది..

    ఇక్కడ గల మొత్తం 20 వార్డులకుగాను లెక్కింపు పూర్తయిన 10 వార్డుల్లో ఏడు వార్డుల్లో కాంగ్రెస్, మూడు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు..

    మరో పది వార్డుల్లో లెక్కింపు జరుగుతోంది.

  • 13 Feb 2026 12:13 PM IST

    జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలంగాణ జాగృతి

    ఏఐఎఫ్ బీ సింహం గుర్తుపై పోటీ చేసి 10 వార్డులకు గాను 8 వార్డుల్లో విజయం సాధించిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు

  • 13 Feb 2026 12:07 PM IST

    • మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి నెలకొంది.

    • మొత్తం 16 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.

    • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు చెరో 8 వార్డుల్లో విజయం సాధించాయి.

    • మెజారిటీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను ఏ పార్టీ దాటలేకపోయింది.

    • ఛైర్‌పర్సన్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది.

  • 13 Feb 2026 12:03 PM IST

    తెలంగాణా మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర స్థాయి ఫలితాలు (వార్డులు)

    మొత్తం: 2,582

    ప్రకటించినవి: 1,280

    కాంగ్రెస్: 695

    బీఆర్ఎస్: 376

    బీజేపీ: 105

    ఇతరులు: 104

  • 13 Feb 2026 12:01 PM IST

    మున్సిపాలిటీ వారీగా తాజా ఫలితాల సారాంశం

    రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వరుసగా వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తోంది.

    నందికొండ (నల్గొండ): 12లో 11 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో చేరి స్పష్టమైన మెజారిటీ సాధించింది.

    గడ్డపోతారం (సంగారెడ్డి): 18లో 14 స్థానాలు గెలుచుకుని బీఆర్ఎస్ పట్టు సాధించింది. కాంగ్రెస్ 3, ఇతరులు 1 గెలిచారు.

    తొర్రూరు (మహబూబాబాద్): 16లో 9 వార్డులు బీఆర్ఎస్ దక్కించుకోగా, కాంగ్రెస్ 6 స్థానాలు సాధించింది.

    దేవరకద్ర (మహబూబ్‌నగర్): 12 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇతరులు 1 గెలవడంతో స్పష్టమైన మెజారిటీ రాలేదు.

    నేరేడుచర్ల (సూర్యాపేట): 15లో 9 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది.

    కోహీర్ (సంగారెడ్డి): 16లో 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, మిగతా మూడు స్థానాలు బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులకు దక్కాయి.

    అయిజ (జోగులాంబ గద్వాల్): 20లో 13 వార్డులు బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి.

    మరిపెడ (మహబూబాబాద్): 15లో 8 కాంగ్రెస్ గెలిచింది.

    సుల్తానాబాద్ (పెద్దపల్లి): 15లో 12 స్థానాలు కాంగ్రెస్ సాధించింది.

    డోర్నకల్ (మహబూబాబాద్): 15లో 11 వార్డులు కాంగ్రెస్ దక్కించుకుంది.

    హాలియా (నల్గొండ): 12లో 8 కాంగ్రెస్ గెలిచింది.

    అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం): 22లో 17 వార్డులు కాంగ్రెస్ గెలిచి స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

    పలు ప్రాంతాల్లో ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.

  • 13 Feb 2026 11:58 AM IST

    పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం

    సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మొత్తం 15 వార్డుల్లో 11 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. బీఆర్ఎస్ 3, బీజేపీ ఒక వార్డు దక్కించుకున్నాయి.

    పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ జెండా ఎగిసింది. 13 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డు సాధించారు.

    కామారెడ్డి జిల్లా బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం చాటింది. బిచ్కుందలో 12 వార్డుల్లో 10 కాంగ్రెస్ ఖాతాలో చేరగా, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం నమోదు చేశారు. ఎల్లారెడ్డిలోనూ 10 వార్డులు కాంగ్రెస్ దక్కించుకుంది. మిగిలిన రెండు స్థానాలు బీఆర్ఎస్, ఇతరులకు దక్కాయి.

    ఈ ఫలితాలతో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ బలమైన స్థితి ఏర్పరుచుకుంది.

  • 13 Feb 2026 11:34 AM IST

    భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి

    నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది.

    మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.

    బీఆర్ఎస్ 4 వార్డుల్లో విజయం నమోదు చేసింది.

    ఈ ఫలితంతో భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతికి వెళ్లింది.

  • 13 Feb 2026 11:33 AM IST

    ధర్మపురి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు

    జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

    మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు ప్రకటించిన 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

    మిగతా వార్డుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉన్నాయి.

Read More
Next Story