
ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.
లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.
Live Updates
- 13 Feb 2026 1:20 PM IST
• కామారెడ్డి మున్సిపాలిటీలో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
• మొత్తం 49 వార్డులకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
• ఇప్పటివరకు 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
• 12 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
• 6 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
• రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.
• ఇంకా 7 వార్డుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.
• తుది ఫలితాల్లో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారే అవకాశముంది.
- 13 Feb 2026 1:16 PM IST
• కామారెడ్డి మున్సిపాలిటీలో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
• మొత్తం 49 వార్డులకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
• ఇప్పటివరకు 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
• 12 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
• 6 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
• రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.
• ఇంకా 7 వార్డుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.
• తుది ఫలితాల్లో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారే అవకాశముంది.
- 13 Feb 2026 1:12 PM IST
• కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి.
• 56వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
• 65వ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి మోసిన్ గెలుపొందారు.
• 42వ డివిజన్‌లో మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి సునీల్‌రావు విజయం సాధించారు.
• కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
• చొప్పదండిలో కాంగ్రెస్‌కు ప్రజలు స్పష్టమైన మద్దతు ఇచ్చారు.
• సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
• ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగిందని మేడిపల్లి సత్యం తెలిపారు.
• కేసముద్రం మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది.
• బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లను క్యాంప్‌కు తరలించినట్లు సమాచారం.
• మరో మూడు ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదు చేసుకునే వ్యూహాన్ని బీఆర్‌ఎస్ రూపొందించింది.
• ఎమ్మెల్సీలు పోచంపల్లి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ గాయత్రి రవి ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
• దీంతో కేసముద్రంలో బీఆర్‌ఎస్ బలం 11కి పెరగనున్నట్లు అంచనా.
- 13 Feb 2026 1:07 PM IST
పెద్దపల్లి : మొత్తం 36 వార్డులకు గానూ కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 1, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 5, ఇండిపెండెంట్ 2 అభ్యర్థులు గెలిచారు.
- 13 Feb 2026 12:46 PM IST
ఆసిఫాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తత
• ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వినోద్ 78 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌పై విజయం సాధించారు.
• ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు ఆటోలో ఎక్కించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
• ఈ చర్యను బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
• రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
• ఈ గందరగోళం మధ్య స్వతంత్ర అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
• మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో స్వతంత్ర అభ్యర్థులపై రాజకీయ పార్టీల ఒత్తిడి చర్చనీయాంశంగా మారింది.
- 13 Feb 2026 12:36 PM IST
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డుల ఫలితాలు ఇలా
• 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామల 17 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
• 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల బాను బాబు 83 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
• 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళి కృష్ణ 86 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
• 4వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొండ్రు ప్రవీణ్ 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
• 5వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి జెర్కొని మమత రాజు 58 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
• 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అమీనా బేగం 265 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
• 7వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి కేవలం 2 ఓట్ల తేడాతో గెలిచారు.
• 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వర్త్య రాందాస్ 217 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దారు రాఘవేందర్‌రావు 11 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
• 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దొంతరమోని భార్గవి 393 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
• 11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత 283 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
• 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొండిగారి త్రిలోక్‌కుమార్ 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇందూరి శ్రీనివాస్ 271 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
• 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎద్దుల విజయలక్ష్మి 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• 15వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి క్యామా శంకర్ 102 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
• 16వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి అలవాల జ్యోతి 348 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• 17వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మడుపు లక్ష్మమ్మ 72 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
• 18వ వార్డులో బీజేపీ అభ్యర్థి సిద్ధం భానుప్రియా 183 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• 19వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి గెలిచారు.
• 20వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంద జయ విజయం సాధించారు.
• 21వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బుగ్గ రాములు 124 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
• 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కప్పరి స్రవంతి 46 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• 23వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి నీలం శ్వేత 12 ఓట్ల తేడాతో గెలిచారు.
• 24వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి గూడూరు గిరీష్ 76 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
- 13 Feb 2026 12:21 PM IST
• తెలంగాణలో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కొన్ని వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
• అలంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి పి. విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
• చౌటుప్పల్ మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి చింతల ఉమామహేశ్వరి విజయం సాధించారు.
• ఎడులాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
• హాలియా మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి చంద్రకళ పిళ్ళి ఎన్నికయ్యారు.
• మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 58వ వార్డు నుంచి బి. రామాదేవి ఏకగ్రీవంగా గెలిచారు.
• రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో 1వ వార్డు నుంచి మడిపెల్లి విజయ విజయం సాధించారు.
• మెదక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 32వ వార్డు నుంచి గోడల మానస ఎన్నికయ్యారు.
• వికారాబాద్ మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి అనంత్ రెడ్డి పటోళ్ల ఏకగ్రీవంగా గెలిచారు.
• యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి గుండ్లపల్లి వాణి ఎన్నికయ్యారు.
• వికారాబాద్ మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి పి. విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 13 Feb 2026 12:18 PM IST
• తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పలు మున్సిపాలిటీల ఫలితాలు స్పష్టమయ్యాయి.
• కాంగ్రెస్ విజయం సాధించిన మున్సిపాలిటీలు: అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్‌పూర్, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్.
• బీఆర్‌ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు: అయిజ, తొర్రూర్, గడ్డపోతారం, ఇంద్రేశం.
• ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించింది.
• కోహీర్, కేసముద్రం, దేవరకద్ర, అలంపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు నమోదయ్యాయి.
• మిగిలిన చోట్ల రాజకీయ సమీకరణాలు కీలకంగా మారే అవకాశముంది.
- 13 Feb 2026 12:17 PM IST
• వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తైంది.
• మొత్తం 10 వార్డుల ఫలితాలు ప్రకటించారు.
• బీఆర్‌ఎస్ పార్టీ 1, 2, 3 వార్డుల్లో విజయం సాధించింది.
• కాంగ్రెస్ పార్టీ 4, 5, 6 వార్డుల్లో గెలుపొందింది.
• సీపీఎం పార్టీ 7వ వార్డులో విజయం సాధించింది.
• బీజేపీ పార్టీ 8, 9, 10 వార్డుల్లో గెలుపొందింది.
• మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా సాగింది.
- 13 Feb 2026 12:17 PM IST
• తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది.
• ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పలు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.
• కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు: నేరేడుచర్ల, హుజూర్‌నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ ఘన్‌పూర్.
• బీఆర్‌ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్.
• ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించింది.
• దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి.
• మిగిలిన చోట్ల ఫలితాల ప్రకటన కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

