ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 9:47 AM IST

    నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వరుస విజయాలు

    • నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. పలు మున్సిపాలిటీల్లో హస్తం అభ్యర్థులు గెలుపొందారు.
    • నందికొండ మున్సిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెనుశా విజయం సాధించారు.
    • హాలియా మున్సిపాలిటీ 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కరుణ సాగర్ గెలుపొందారు.
    • కల్వకుర్తి మున్సిపాలిటీ 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల లలిత 52 ఓట్ల మెజారిటీతో విజయం నమోదు చేశారు.
    • జిల్లాలో మరిన్ని ఫలితాలు వెలువడుతున్నాయి.

  • 13 Feb 2026 9:46 AM IST

    ఎల్లంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం.. కాంగ్రెస్‌కూ విజయాలు

    మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరుసగా వార్డుల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10వ వార్డులో శ్రీలత రమేష్ విజయం సాధించారు. 12వ వార్డులో కల్పన మాణిక్య రావు గెలుపొందారు. 16వ వార్డులో సురేష్ రెడ్డి విజయం నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వార్డుల్లో గెలుపొందింది. 1వ వార్డులో మామిళ్ళ బాలమణి విజయం సాధించారు. 15వ వార్డులో వేణు గౌడ్ గెలిచారు. ఇంకా మిగతా వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉన్నాయి.

  • 13 Feb 2026 9:45 AM IST

    సిరిసిల్ల లో కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టు ధర్నా

    సిరిసిల్ల మున్సిపల్ కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియాని అడ్డుకున్న పోలీస్ 

     పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదంటూన్న పోలీసులు

    సెంటర్ వద్ద ధర్నా చేస్తున్న జర్నలిస్టులు

  • 13 Feb 2026 9:39 AM IST

    ఆలియాబాద్ మున్సిపాలిటీలో మిశ్రమ ఫలితాలు

    • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడుతున్నాయి.
    • 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్ గెలుపొందారు.
    • 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక విజయం సాధించారు.
    • 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.
    • ఇంకా ఇతర వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉన్నాయి.

  • 13 Feb 2026 9:35 AM IST

    కామారెడ్డిలో పోలింగ్ కేంద్రం దగ్గర జర్నలిస్టుల నిరసన

    • కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు రోడ్డెక్కారు.
    • పోలింగ్ కేంద్రం వద్ద తమకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
    • నిర్లక్ష్యానికి నిరసనగా విధులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు.
    • పరిస్థితిని గమనించిన అధికారులు చర్చలకు ప్రయత్నిస్తున్నారు.

  • 13 Feb 2026 9:31 AM IST

    ములుగు 1వ వార్డులో కాంగ్రెస్ విజయం

    • ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.
    • 1వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
    • ఈ ఫలితంతో ములుగులో కాంగ్రెస్‌కు తొలి విజయం దక్కింది.

  • 13 Feb 2026 9:30 AM IST

    ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ గెలుపు

    • సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.
    • ఇంద్రేశం మున్సిపాలిటీలో 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత భుజంగ రెడ్డి విజయం సాధించారు.
    • ఈ ఫలితంతో ఇంద్రేశంలో కాంగ్రెస్ తొలి గెలుపు నమోదు చేసింది.

  • 13 Feb 2026 9:30 AM IST

    కాగజ్‌నగర్‌లో బీజేపీకి మరో విజయం

    • కోమరంభీం జిల్లాలో బీజేపీ ఖాతాలో మరో సీటు చేరింది.
    • కాగజ్‌నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి దూసారి కృష్ణవేణి గెలుపొందారు.
    • ఈ ఫలితంతో ఆ వార్డులో బీజేపీ ఆధిపత్యం నమోదు చేసింది.

  • 13 Feb 2026 9:29 AM IST

    ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ విజయం

    • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మరో ఫలితం వెలువడింది.
    • 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండిగారి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
    • త్రిలోక్ కుమార్‌కు 316 ఓట్లు వచ్చాయి.
    • కాంగ్రెస్ అభ్యర్థి ఏర్పుల చంద్రయ్యకు 216 ఓట్లు లభించాయి.
    • ఈ ఫలితంతో 12వ వార్డులో బీఆర్ఎస్ ఖాతా తెరిచింది.

  • 13 Feb 2026 9:29 AM IST

    మక్తల్‌లో బీజేపీ ముందంజ

    మక్తల్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్స్‌లో బీజేపీ ముందంజ

    నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తొలి రౌండ్ లెక్కింపు పూర్తైంది.

    మొత్తం 8 వార్డులకు చెందిన 1, 2, 3, 5, 7, 8, 11, 13 వార్డుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు.

    పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

    • బీజేపీకి 9 ఓట్లు వచ్చాయి.
    • కాంగ్రెస్‌కు 5 ఓట్లు లభించాయి.
    • టిఆర్ఎస్‌కు 5 ఓట్లు నమోదయ్యాయి.
    • ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2 ఓట్లు వచ్చాయి.

    మరిన్ని రౌండ్ల లెక్కింపు కొనసాగుతోంది.

Read More
Next Story