నిమ్స్ నుంచే ఆరోగ్య శ్రీ!
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేసిన సీఎం
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. శనివారం రెండింటిని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని.. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మంత్రుల శాఖల కేటాయింపుపై సస్పెన్స్..
మరోవైపు మంత్రుల శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో శాఖల కేటాయింపుపై రేవంత్‌రెడ్డి చర్చించి వచ్చారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమతుల్యత ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే రేవంత్ టీమ్‌లో 11 మంది ఉన్నారు. మరో 8 మందికి చాన్స్ వచ్చే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నాయకునిగా ఎన్నిక...
శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఫ్లోర్ లీడర్‌గా మాజీ సీఎం కే చంద్రశేఖరరావును ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. అయితే పార్టీలో మరో అభిప్రాయమూ లేకపోలేదు. పార్టీ శాసనసభాపక్ష నేతగా హరీశ్ రావును ఎంపిక చేస్తే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పడిన కుటుంబ పాలన ముద్ర పోతుందన్న భావనను ఓ సీనియర్ నేత వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం...
శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అక్బరుద్దీన్ చేత తాము ప్రమాణస్వీకారం చేసేది లేదని... అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు రాజాసింగ్ ప్రకటించారు.