చేవెళ్ళ దగ్గర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి (వీడియో)
సోమవారం తెల్లవారి సుమారు 5 గంటల ప్రాంతంలో చేవెళ్ళ మండలం ఫీర్జాదీగూడ దగ్గర(Road accident) ఈప్రమాదం జరిగింది
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది చనిపోయారు. చేవెళ్ళ ఏసీపీ కిషన్ మృతుల సంఖ్యను ధృవీకరించారు. ఈ ఉదయం 4:45 గం.కు వికారాబాద్‌లోని తాండూర్ డిపో నుంచి ఈ ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వస్తుండగా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద కంకర లోడ్‌తో అతివేగంతో టిప్పర్ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
కర్నూలు లో ఈమధ్యనే జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది చనిపోయిన ప్రమాదాన్ని జనాలు మరువకముందే తాజాగా మరో ఘోర రోడ్డుప్రమాదం జరగింది. పెద్దఎత్తున చనిపోవటమే కాకుండా చాలామందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. టిప్పర్లోని కంకరంతా బస్సులోని ప్రయాణీకులపైన పడిపోయింది. కంకర మొత్తం ప్రయాణీకుల మీదపడటంతో అందులోనే చాలామంది కూరుకుపోయారు. ప్రయాణికుల బంధువుల కోసం సెక్రటేరియట్ లో ఒక కంట్రోల్ రూం తెరిచారు. ఫోన్ నెంబర్ ఇవే: 9912919545, 9440854433
కంకరలో కూరుకుపోవటంతో చాలామంది ప్రయాణీకులకు ఊపిరిాఆడలేదు. దాంతో బస్సులోనే 20 మంది చనిపోయినట్లు పోలీసులు అంచనా వేశారు. ఆసుపత్రిలో మరో 4గురు చనిపోయారు. తెల్లవారి జామున అయిదు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినపుడు అందరు మంచినిద్రలో ఉన్నారు. తమమీద కంకర పడిపోతున్న విషయాన్ని కూడా ప్రయాణీకులు గ్రహించలేకపోయారు. మీదపడుతున్న కంకరనుండి తప్పించుకునేంత సమయం కూడా ప్రయాణీకులకు దొరకలేదు. డ్రైవర్ సీటు వెనుక ఉండే సీట్లలోని ప్రయాణీకులే ఎక్కువమంది చనిపోయారు.
క్లుప్తంగా
• రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసి బస్సును ఢీకొట్టిన కంకర మోసుకొస్తున్న టిప్పర్
• బస్సు, లారీ డ్రైవర్లతో సహా 24 మంది ప్రయాణికులు మృతి, మృతుల్లో 10 నెలల చిన్నారి, తల్లి
• ప్రమాదం నుంచి బస్సు కండక్టర్ రాధ సురక్షితంగా బయటపడ్డారు
• బస్సులో చిక్కుకున్నవారిలో 15 మందిని బయటకు తీసిన సిబ్బంది
• ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు
• పలువురు ప్రయాణికులకు గాయాలు, కొందరి పరిస్థితి విషమం
• గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు. గాయపడిన వారికి 10 మందికి చేవెళ్ల లోని ప్రభుత్వ ఆస్పత్రి, మరో 10 మందికి పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో వైద్యం
• సహాయచర్యలో పాల్గొన్న చేవెళ్ల సర్కిల్ ఇన్స్ పెక్టర్ కు భూపాల్ శ్రీధర్‌ను జెసిబి తాకడంతో గాయాలు
• సీఐ కాలి మీదుగా జేసీబీ వెళ్లడంతో గాయాలు, ఆయనకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
చేవెళ్ళ దగ్గర ఆర్టీసీ బస్సును ఒక టిప్పర్ ఢీకొన్నపుడు ఈప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారి సుమారు 5 గంటల ప్రాంతంలో చేవెళ్ళ మండలం ఫీర్జాదీగూడ దగ్గర(Road accident) ఈప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 70 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కంకర్ టిప్పర్ బలంగా ఢీకొన్నది. బస్సును బలంగా ఢీకొనటంతో టిప్పర్లోని కంకరంతా బస్సులో పడిపోయింది.
బస్సు-టిప్పర్ బలంగా ఢీ కొనటంతో టిప్పర్లోని కంకర ప్రయాణీకుల్లో పడటంతో కొందరు అందులో కూరుకుపోయారు. ప్రయాణీకులు నిద్రలో ఉండటంతో తేరుకునేందుకు సమయంపట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు వెంటనే సహాయచర్యలకు రంగంలోకి దిగటమే కాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులురాగానే గాయపడిన వారిని బస్సులో నుండి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ కూడా ఘటనలోనే చనిపోయాడు. ప్రమాదం కారణంగా చేవెళ్ళ-వికారాబాద్ నేషనల్ హైవేపై భారీఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు వెల్డింగ్ మిషన్ను ఉపయోగించి బస్సు కిటీకలను, బస్సులోకి చొచ్చుకుపోయిన టిప్పర్ భాగాలను కట్ చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా రావాల్సుంది.
ముఖ్యమంత్రి విచారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. సహాయకచర్యలకోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్ కి ముఖ్యమంత్రి ఫోన్ లో ఆదేశాలిచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు.
రవాణా మంత్రి దిగ్భాంతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదకారణాలపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచనలిచ్చారు. కంకర లోడు తో ఉన్న ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని కూగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.