రేవంత్ మాట స్పీకర్‌కు శాసనమైతాంది: కేటీఆర్
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా బీఆర్ఎస్‌ను అడ్డుకోలేకపోయారన్న కేటీఆర్.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. వాళ్లదీ ఒక బతుకేనా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల విషయంలో రేవంత్ ఏం చెప్తే అదే స్పీకర్ చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికయినా సర్పంచ్‌లో కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసిన బీఆర్ఎస్‌ను అడ్డుకోలేకపోయిందన్నారు. అనేక గ్రామాల్లో అక్రమాలు చేసే కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఈ సందర్భంగానే ఫిరాయింపు నేతల విషయంలో స్పీకర్ తీర్పును కూడా ఖండించారు. పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై విమర్శలు గుప్పించారు. వాళ్లి ఏం బతుకో అర్థం కావట్లేదన్నారు.
ఇది సామాన్యమైన గెలుపు కాదు
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సాధించిన గెలుపు, చూపిన ఉత్సాహం సామాన్యమైనది కాదన్నారు కేటీఆర్. అదే విధంగా కాంగ్రెస్ చేసిన అరాచకాలు కూడా సామాన్యమైనవి కావన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో కొత్త ఊపొచ్చిందన్నారు. ‘‘నూతన్‌కల్ మండలంలో లింగపల్లిలో మల్లయ్య యాదవ్‌ను కాంగ్రెస్ వాళ్లు రాళ్లతో దాడి చేసి హతమార్చారు. 50మంది కాంగ్రెస్ ముష్కరులు ఈ దాడి చేశారు. ఇలా ఒక్క చోటే కాదు. అనేక ప్రాంతాల్లో జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజకీయం అత్యంత గలీజుగా తయారింది. నల్గొండ తిప్పర్తిలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు యాదగిరి నామినేషన్ వేశారు. అతనిని కాంగ్రెస్ గూండాలు అతి కిరాతకంగా కొట్టి బెదిరించారు. అయినా పోటీ నుంచి తప్పుకోకపోవడంతో యాదగిరి కిడ్నాప్ చేశారు. మూత్రం తాపించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలను చూస్తేనే కాంగ్రెస్ పాలన ఎంత కిరాతకంగా ఉంద అర్థం చేసుకోవచ్చు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
స్పీకర్‌కు కనబడదు, వినబడదు..
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం స్పీకర్‌కు కనిపిస్తలేదంట అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా వాళ్లే చెప్పుకున్నారని, కడియం శ్రీహరి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని ప్రసంగాలే ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ అవేమీ స్పీకర్‌కు కనిపించడం లేదని చురకలంటించారు. ‘‘సీఎం రేవంత్ ఏం చెప్తే అదే స్పీకర్ వింటున్నారు. అంతే చేస్తున్నారు. సీఎం మాట స్పీకర్‌కు శాసనం అవుతోంది’’ అని అన్నారు కేటీఆర్.
‘‘పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్లు ఆడనో మగనో చెప్పుకోలేకున్నారు. మీది ఏ పార్టీ అంటే వాళ్ల దగ్గర సమాధానం ఉండట్లేదు. ఇదెంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కళ్లు 70ఏళ్లకు వచ్చారు. ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. 70ఏళ్ల మనిషి. ఆయనకెందుకు. ఒకసారి స్పీకర్, ఒకసారి మంత్రి పదవులు ఇచ్చారు కదా కేసీఆర్. అంతకన్నా ఇంకేం చేస్తారు. సిగ్గులేకుండా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరావ్. సమాధానం చెప్పలేకనే అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ల వైపు కూర్చున్నారు పోచారం. మా నేతవి అటెందుకు కూర్చున్నావ్ అని బీఆర్ఎస్ వాళ్లు అడిగితే.. బాత్రూం దగ్గరగా ఉంటది అని చెప్తుండు ఆయన. అదొక బతుకా.. అంతకన్నా చావడం నయం కాదు. ఆ పది మంది ఎమ్మెల్యేలది ఏం బతుకు. వాళ్లు ఛీఛీ అని కొడుతుననా గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడబడినట్లు చేస్తుండ్రు’’ అని విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ లేకుంటే అవన్నీ ఏవి..
‘‘కేసీఆర్ అంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకి కూడా ప్రేమే. అసలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా. వాళ్లేదో అనాలని బయట మాటలు మాట్లాడటమే తప్పా.. బయట కలిసినప్పుడు పెద్దాయన ఎలా ఉన్నారనే అడుగుతారు. 2001లో గులాబీ జెండా ఎగరడం వల్లే తెలంగాణ వచ్చిందని, చావు నోట్లో కేసీఆర్ తల పెడితేనే తెలంగాణ వచ్చిందని, ఆ తెలంగాణ వస్తేనే కదా ఇప్పుడు టీపీసీసీ, టీబీజేపీ, టీసీఎం వచ్చింది. అందుకే వాళ్లకి కూడా మాగా తెలుసు. మహేష్ కుమార్ గౌడ్‌కు, రామచందర్ రావుకు తెలుసు.. అందుకే బయటకు ఏదో మాట్లాడతారు కానీ.. కలిసినప్పుడు కేసీఆర్ ఎలా ఉన్నారనే అడుగుతారు’’ అని కేటీఆర్ చెప్పారు.