బోణి కొట్టిన హస్తం పార్టీ..తెలంగాణలో కాంగ్రెస్ విజయోత్సవాలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరావు 28000 ఓట్ల మెజారిటితో గెలుపొందారు.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-03 06:09 GMT
congress party symbol

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 67 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటితో పాటు, గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరావు 28000  ఓట్ల మెజారిటితో గెలుపొందారు. 

రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రేవంత్ రెడ్డి పోటీ చేసిన రెండు స్థానాల్లోను భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కొడంగల్ లో ఆధిక్యం 9 వేలు దాటగా, కామారెడ్డిలో 2 వేల ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. మరోవైపు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమర్ రెడ్డి పోటీ చేస్తున్న హుజుర్ నగర్ లో మెజారిటీ 23 వేలు దాటింది. సీఎల్పీ ఉప నాయకుడు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో నూ ఆయన ఆధిక్యం 12 వేలు దాటింది. ములుగులో సీతక్క, నిజామాబాద్ రూరల్ లో షబ్బీర్ అలీ, ఆందోల్ నుంచి పోటీ చేస్తున్న దామోదర రాజనర్సింహ ల ఆధిక్యం సైతం పది వేలు దాటింది.

ప్రస్తుత అధికార బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. వారిలో ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. కాగా బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో తన సత్తా చాటింది. తొలిసారిగా డబుల్ డిజిట్ మార్క్ స్థానాల్లో కాషాయ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది. 

Tags:    

Similar News