కేసీఆర్ నాలుక ఎందుకు మడతేసినట్లు.. కారణం అదేనా?
ప్రజావ్యతిరేకతను కేసీఆర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారా? అందుకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని భావిస్తున్నారా?
ప్రజావ్యతిరేకతను కేసీఆర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారా? అందుకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని భావిస్తున్నారా?
‘‘జాతీయ పార్టీలు, పొరుగు రాష్ట్రాల నేతలతో ప్రమాదం పొంచి ఉంది. మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ శక్తులతో పోరాడి ఓడడం మనకు అవమానకరం. తెలంగాణ ఆత్మ గౌరవ పరిరక్షణ ఇక మీ చేతుల్లోనే ఉంది.’’ ఇవి సీఎం కేసీఆర్ ఇటీవల ఓటర్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలివి.
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తూ.. పొరుగు రాష్ట్రాల నేతలు వైఎస్ షర్మిల (ఆంధ్రప్రదేశ్), డీకే శివకుమార్ (కర్ణాటక డిప్యూటీ సీఎం), యోగి ఆదిత్యనాథ్ (యూపీ ముఖ్యమంత్రి) తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఆయన తెలంగాణ శత్రువులుగా చిత్రీకరించారు. ఈ పార్టీలతో ఎన్నికల్లో తలపడి ఓటమి చెందడం తెలంగాణకు అవమానకరమని..ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కేసీఆర్ కోరారు.
‘‘భవిష్యత్తు అంతా ప్రాంతీయ పార్టీలదే. 2024 ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదు. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి పార్టీల మద్దతు అవసరం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించడం ద్వారా బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది’’ అని వరంగల్, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, ఆదిలాబాద్, బోథ్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
అక్టోబర్ 15న ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి నెల రోజుల పాటు వృద్ధాప్య పింఛన్లు, రైతు బంధు, దళిత బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఉచిత విద్యుత్, రోడ్లు, ఫ్లైఓవర్లు తదితర పథకాల అమలుపై కేసీఆర్ ఆర్భాటంగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఈ పథకాలన్నీ నిర్వీర్యమవుతాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలని ప్రచార సభల్లో కేసీఆర్ ఓటర్లను కోరుతున్నారు. 2014 తర్వాత 10 సంవత్సరాల పాటు మోడీ ప్రభుత్వ ‘‘సహకార నిరాకరణ’’కు గురయ్యాం. అంతకు ముందు కేంద్రంలోని వరుస కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఎంతో నష్టపోయిందని బీఆర్‌ఎస్ చీఫ్ చెబుతున్నారు.
సంక్షేమ కథనాలు మాత్రమే సరిపోవు..
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతోన్న అధికార వ్యతిరేకతను తగ్గించేందుకు, అలాగే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోడానికి కేవలం ‘‘సంక్షేమ పథకాలు’’ మాత్రమే సరిపోవన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించినట్లుందని తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ అన్నారు.
‘‘రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్లీ తెరపైకి రావడంతో.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయని వాగ్దానాలు, వైఫల్యాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచారంలో ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్.. ‘‘బ్యాక్ టు బేసిక్స్’’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కోదండరామ్ పేర్కొన్నారు.
2018 నుంచి ఇప్పటి వరకు, తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 2018లో కేసీఆర్‌ను ఎవరూ ఢీ కొట్టలేకపోయారు. ఆయన ఒక్కరే రాజకీయాలను శాసించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ‘‘తెలంగాణలోకి దొడ్డిదారిన ప్రవేశించిన ఆంధ్రా నాయకుడంటూ’’ ముద్ర వేశారు.
రాష్ట్రంలో బీజేపీకి విశ్వసనీయత లేదు. కానీ గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాజకీయాలు ఎందరో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ నేతలను తయారు చేశాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ పుంజుకోగా, బీజేపీ కూడా బండి సంజయ్, ఈటల రాజేందర్, ఎం రఘునందన్, ధర్మపురి అరవింద్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతలను తయారు చేసింది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ను ఘాటుగా విమర్శించే నాయకుడిగా ఎదిగారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వారి ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఇదంతా.. జాతీయ పార్టీలు పొరుగు రాష్ట్రాల నేతల సాయంతో తనను ఓడిరచేందుకు చేస్తున్న కుట్రగా ముద్రవేయడం తప్ప కేసీఆర్‌కు మరో మార్గం లేదు.
కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత..
‘గులాబి దళపతి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దాన్ని తొలగించుకోడానికి కేసీఆర్ మళ్లీ ‘తెలంగాణ కార్డు’ ప్రయోగిస్తున్నారు’’ అని రాజకీయ వ్యూహకర్త జేవీసీ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.
‘‘దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి మంచి పట్టుంది. ఈ ప్రాంతాల నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారన్న విషయాన్ని మరిచిపోకూడదు. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం సపోర్టు ఉంది. కాబట్టి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ వెనకపడొచ్చు. అయితే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పట్టుబిగిస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీనిస్తాయని అంచనా వేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి, ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వడం ద్వారా బీజేపీ కొంత లాభపడవచ్చు. ఇది ఊహించని పరిస్థితి.’’ అని శ్రీరామ్ ది ఫెడరల్‌తో అన్నారు. కేసీఆర్ ప్రాంతీయ వాదం, ఆత్మగౌరవ నినాదం అందుకోడానికి ఇదే కారణమని ఆయన అన్నారు.
ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డాక్టర్ పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ.. 2024 ఎన్నికల తర్వాత న్యూఢల్లీిలో బీఆర్‌ఎస్ కీలక పాత్రపై స్పందించారు. ‘‘నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే. బీజేపీకూ గట్టి దెబ్బే. కేంద్రంలోని ప్రాంతీయ పార్టీలకు బలమైన ప్రాంతీయ నేతగా కేసీఆర్ ఎదుగుతారు. బహుశా కేసీఆర్ ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత గురించి మాట్లాడినపుడు ఆయన దృక్పధం ఓటర్లకు స్ఫురించిఉండవచ్చు’ అని అన్నారు.