‌రేవంత్‌ ‌బయోపిక్‌ ‌వచ్చేస్తుందా?

ఇపుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. రేవంత్‌ ‌బయోపిక్‌ను తీస్తానంటున్న ఆ నిర్మాత ఎవరు?

Update: 2023-12-07 11:52 GMT

రేవంత్‌ ‌సీఎం అయిపోయారుగా..ఇక వార్తలన్నీ ఆయన గురించే..పేపరోళ్లు ఆయన గురించే రాసేస్తున్నారు. టీవీ ఛానలోళ్లు ఆయన గురించే చూయిస్తున్నారు. సినిమా వాళ్లు రేవంత్‌ ‌గురించి ఏం చూయించరా? అంటే సినిమా లాంటి ఏదైనా..కల్పిత కథల కంటే..ఈ మధ్య బయోపిక్‌లే ఎక్కువ క్లిక్‌ అవుతున్నాయి. ఆ మధ్య రాంగోపాల్‌ ‌వర్మ ఎన్‌టీ రామారావు మీద తీసిన చిత్రం ‘‘లక్ష్మిస్‌ ఎన్‌టీఆర్‌’’. ‌రామారావు వ్యక్తిగత జీవితంలో కొంతభాగాన్ని, రాజకీయాల్లో ఆయనకు ఎదురైనా సవాళ్లను ఈ చిత్రంలో తెరకెక్కించారు రామ్‌‌ గోపాల్‌ ‌వర్మ. ఈ మూవీని ఆడియన్స్ ‌బాగా లైక్‌ ‌చేశారన్న టాక్‌ ‌కూడా అప్పట్లో వినిపించింది. 

‌నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ ‌కూడా రేవంత్‌ ‌రెడ్డిపై బయోపిక్‌ ‌తీయాలనుకుంటున్నాడట.కొత్త సీఎం రేవంత్‌ ‌పర్మిషన్‌ ఇస్తే చేసేస్తానంటున్నారు. రేవంత్‌ ‌పొలిటికల్‌ ‌లైఫ్‌ను ఇందులో ప్రధానంగా చూయిస్తాడనుకుంటా. బండ్ల గణేష్‌కు రేవంత్‌ ఆ ‌ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం. 

Tags:    

Similar News