కాంగ్రెస్ సంబరాల్లో టీడీపీ జెండాలు

Producer :  Chepyala Praveen
Update: 2023-12-03 08:50 GMT
గాంధీ భవన్ లో రెపరెపలాడుతున్న టీడీపీ జెండాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆ పార్టీ 15 స్థానాల్లో గెలుపొందగా, మరో 55 స్థానాల్లో లీడ్ లో ఉంది. దాంతో గాంధీ భవన్ లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ సంబరాల్లో టీడీపీ జెండాలు కూడా దర్శనమిస్తున్నాయి. కోలాహలంగా ఉన్న గాంధీ భవన్ లోపలి ప్రాంతాల్లో పసుపు జెండాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 39 శాతం ఓట్లను పొందింది. బీఆర్ఎస్ పార్టీ 37 శాతం ఓట్లను సాధించింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 47 శాతం ఓట్లతో 88 సీట్లను సాధించగా, ఇప్పుడు ఏకంగా 10 శాతం ఓట్లను కోల్పోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 శాతం ఓట్లను సాధించింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ 7 శాతం ఓట్లతో కేవలం ఒక్క సీటుకే పరిమితం కాగా ప్రస్తుతం 14 శాతం ఓట్లతో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కొద్దిసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News