తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎలక్షన్ కమిషన్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ..బీజేపీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 30వేల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు ఆంధోల్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర రాజనర్సింహ 24 వేల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. నల్గొండలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపొందారు. మెదక్‌లో కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్, మంథనిలో డి. శ్రీధర్ బాబు విజయం సాధించారు.
బీజేపీ నుంచి..
కాగా.. కుత్బూల్లాపుర్‌లో బీజేపీ అభ్యర్థి వివేకానంద 82 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
బీఆర్‌ఎస్ నుంచి..
మెదక్ జిల్లా దుబ్బాకలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఇక్కడ బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో దిగారు. గత ఉప ఎన్నికల్లో రఘనందన్ విజయం సాధించినా .. ఈ సారి మాత్రం ఓటమిని చవిచూశారు.