పార్టీల ప్రలోభాలకు లొంగొద్దు

రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దు. భారత రాజ్యాంగం ఇచ్చిన అరుదైన అవకాశం ఓటు హక్కు, తెలంగాణ ఓటర్లకు గవర్నర్ తమిళిసై సందేశం

Reporter :  The Federal
Update: 2023-11-30 12:25 GMT
Haryana Governer Hon'ble Bandaru Dattatreya

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజ‌కీయ‌ పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన అరుదైన అవకాశం ఓటు హక్కు. దీనిని నిర్లక్ష్యం చేయవద్దని త‌మిళ‌సై కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ డే రోజు సెలవు ప్రకటించిందని , ఇంటి వద్ద కూర్చోకుండా, ఎంజాయ్ చేయకుండా అత్యంత విలువైన ఓటును ఉపయోగించాలన్నారు. కొత్త‌గా ఓటు హ‌క్కు వ‌చ్చిన‌వారంతా పోలింగ్ స్టేషన్లకు పోటెత్తాలని పిలుపునిచ్చారు. ఏమరుపాటుగా ఉండ వద్దని, ప్రజల కోసం పని చేసే అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఓటు వేయాలని గవర్నర్ కోరారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటు వేయాలని అన్నారు. పార్టీలు ముఖ్యం కాదని, కావాల్సిందల్లా చైతన్యవంతంతో కూడిన ఓటును గుర్తించాలని తమిళి సై సౌందర రాజన్ స్పష్టం చేశారు . కనీసం 100 శాతం ఓటు పోల్ కావాలని ఆ దిశగా కదలాలని పేర్కొన్నారు.

హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్, కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ త‌న కుటంబ స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లోని రామ్‌న‌గ‌ర్‌లో ని వీ.జే. హైస్కూల్‌లో ఓటు వేశారు.  రాజ్యాంగం ద్వారా లభించిన ఓటు హక్కు ను ప్రతి ఒక్కరు పోలింగ్ లో పాల్గొనాలని కోరారు. 

Similar News