హైదరాబాదీ ఏం మారలేదు

హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడంతో తమ పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లు లేకుండా వెలవెలబోతున్నాయి.

Producer :  Chepyala Praveen
Update: 2023-11-30 08:57 GMT
క్యూ లో నిల్చున్న ఓటర్లు


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకూ కేవలం 21 శాతం వరకూ మాత్రమే ఓటింగ్ నమోదు అయింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి పరిధిలో ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం చూపలేదు. ఉప్పల్ లో 26 , కూకట్ పల్లిలో 22, కుత్భుల్లా పూర్ లో 28 శాతంగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం వరకూ తెలంగాణ వ్యాప్తంగా 36. 68 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా మెదక్ లో 51 శాతం కాగా, తరవాత వరుసగా మంథని, జోగులాంబ గద్వాల, భూపాల్ పల్లి, యాదాద్రి భువనగిరి ఉన్నాయి. రూరల్ ప్రాంతాల్లో ప్రజలు భారీ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయిన ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలే కావడం గమనార్హం.

Tags:    

Similar News