11 గంటలకు 26% పోలింగ్ : పశ్చిమ బెంగాల్‌లో ఘర్షణ

లోక్‌సభ ఎన్నికల్లో ఏడో, చివరి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం 26.3 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

Update: 2024-06-01 09:00 GMT

లోక్‌సభ ఎన్నికల్లో ఏడో, చివరి దశ పోలింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితో సహా ఏడు రాష్ట్రాలు, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు శనివారం జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం 26.3 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు, ఉత్తరప్రదేశ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో హింస..

పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని వార్తలొస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉద్రికత్త చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడ కొంతమంది పోలింగ్ కేంద్రంలోకి చొరబడి EVM మెషీన్‌ను తీసుకుళ్లారు. అనంతరం చెరువు సమీపంలో అది కనిపించింది. జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టిఎంసి, ఐఎస్ఎఫ్‌, బిజెపి మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా ఆపడంపై రెండు పార్టీలు గొడవపడ్డాయి. 

Tags:    

Similar News