ఢిల్లీలో బీజేపీ నేతల సమావేశం - హాజరవుతున్న చంద్రబాబు

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) సీనియర్ నేతలు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు.

Update: 2024-06-05 06:27 GMT

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) సీనియర్ నేతలు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వారు చర్చించనున్నారు. బిజెపి మిత్రపక్షాల అగ్రనేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీకి సమావేశానికి హాజరయ్యే నేతలంతా అభినందనలు తెలుపుతారు.

ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సమావేశానికి తాను హాజరవుతున్నానని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇప్పటికే పేర్కొన్నారు.

మెజార్టీ మార్కు దాటిన ఎన్డీఏ..

543 మంది సభ్యుల లోక్‌సభలో NDA మెజారిటీ మార్కు 272ని దాటింది. ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల సహకారం తప్పనిసరైంది. టీడీపీ, జేడీ(యూ), మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌) వరుసగా 16, 12, 7, 5 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయి.

Tags:    

Similar News