మహారాష్ట్ర సీఎం పదవిపై కూటమి పార్టీ నేతలు ఏమంటున్నాయి?

మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Update: 2024-11-22 09:15 GMT

మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం రేపటి దాకా అటుంచితే.. గెలిచిన కూటమిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేదెవన్నరు? అన్న దానిపైనే మహారాష్ట్రలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవికి పేర్ల ఎంపికలో రెండు కూటముల్లోనూ విభేదాలు తలెత్తాయని సమాచారం.

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాయుతి అధికారాన్ని నిలుపుకుంటుందని అంచనా వేయగా.. కొన్ని MVA వైపు మొగ్గు చూపాయి.

రేపు కౌంటింగ్..

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి బుధవారం (నవంబర్ 20) పోలింగ్ ముగిసింది. రేపు (23వ తేదీన) ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు వస్తాయని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు మిత్రపక్షం శివసేన (UBT)కు నచ్చలేదు. మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది MVA కూటమి భాగస్వాములు కలిసి నిర్ణయం తీసుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పటోలే సీఎం అవుతారని కాంగ్రెస్ హైకమాండ్ చెబితే అదే విషయాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా ప్రకటించాలన్నారు.

మహాయుతి నుంచి సీఎం అయ్యేదెవరు?

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారని మహాయుతి పక్షంలో శివసేన ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ చెప్పారు. “ఓటింగ్ ద్వారా ఓటర్లు షిండేకు ప్రాధాన్యత ఇచ్చారు. తదుపరి సీఎం కావడానికి షిండేనే అర్హుడని నేను భావిస్తున్నాను. ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసం కూడా ఉంది.” అని శిర్సత్ పేర్కొన్నారు.

కాదు ఫడ్నవీస్ అవుతారు..

ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం అవుతారని బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అవుతారంటే అది దేవేంద్ర ఫడ్నవీస్ అని అన్నారు. ఇక ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ తన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేరును ప్రతిపాదించారు. "ఫలితాలు ఎలా ఉన్నా, ఎన్‌సీపీ కింగ్‌మేకర్ అవుతుంది" అని మిత్కారీ పేర్కొన్నారు. సీఎం పదవి ఎవరిని ఇస్తారన్న ప్రశ్నకు ..మహాయుతి పార్టీలు కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాయని ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం తామేనని ధీమాగా చెప్పారు. ఇదే విషయాన్ని చెప్పారు బీజేపీ నాయకుడు దారేకర్. మహాయుతి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. MVA అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రతిపక్ష కూటమిలో అంతర్గత కుమ్ముబాట ఎక్కువైందని కూడా చెప్పారు. “మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి మహాయుతికి చెందిన వ్యక్తి అవుతాడు. MVA కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ కాదు.” అని నొక్కి చెప్పారు దారేకర్.

MVAలోని విభేదాలను బయటపెడుతూ దారేకర్ ఇలా ఉన్నారు. “కాంగ్రెస్ ఎంపీ ప్రణితి షిండే, ఆమె తండ్రి, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఉద్ధవ్ థాకరే పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఈ అంతర్గత విభేదాలు ఐక్యతా లోపాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అంతర్గత సమన్వయం లేని పార్టీలు ముఖ్యమంత్రిని ఎలా నిర్ణయిస్తాయి? అని ప్రశ్నించారు. పటోలే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఒక పగటి కలే అని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై, దారేకర్ ఇలా వ్యాఖ్యానించారు, “ఏ ఎగ్జిట్ పోల్ ఫైనల్ కానప్పటికీ, చాలా మంది మహాయుతి విజయం సాధిస్తారని అంచనా వేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా (గెలుపుపై) మహాయుతికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

అదానీ గ్రూప్‌పై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనల గురించి బీజేపీ నాయకుడు దారేకర్ ఇలా చమత్కరించారు. “రాహుల్ గాంధీ యుఎస్‌కి వెళ్లి విదేశాల్లోని అక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలి. అక్కడ అతని వ్యాఖ్యానానికి విలువ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పతనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని పేర్కొన్నారు.

ఎన్‌సీపీ (ఎస్‌పీ) లోక్‌సభ వేల సుప్రియా సూలే, పటోలే ఎన్నికల్లో డబ్బు కోసం చట్టవిరుద్ధంగా బిట్‌కాయిన్‌ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దారేకర్ స్పందించారు. త్వరలో నిజం బయటకు వస్తుందని అన్నారు.

పెరిగిన ఓటింగ్ శాతం

రాష్ట్రంలో నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడాన్ని హైలైట్ చేస్తూ.. ఓటింగ్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అట్టడుగు స్థాయి ప్రచారానికి దారేకర్ ఘనత వహించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చివరిగా 66.05 శాతం పోలింగ్ నమోదైంది, ఇది 2019లో 61.1 శాతంగా ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. మహాయుతి ప్రభుత్వం “లడ్కీ బహిన్ యోజన” మహిళా ఓటర్లను ఆకర్షించిందని దారేకర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News