గుజరాత్‌లో ఎక్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

గుజరాత్‌లో గెలుపెవరిది? ఎక్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? రాజకీయ పండితుల మాటేంటి?

Update: 2024-06-03 12:04 GMT

గుజరాత్‌లో బీజేపీ వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి రాష్ట్రంలో కొన్ని స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సారి గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించడం అంత ఈజీ కాదంటున్నారు కొంతమంది రాజకీయ పండితులు.

"రాజ్‌కోట్, భావ్‌నగర్‌, జామ్‌నగర్ లాంటి స్థానాల్లో బలమైన బిజెపికి తీవ్ర వ్యతిరేకత ఉంది." అని అహ్మదాబాద్‌లోని రాజకీయ విశ్లేషకుడు, సామాజిక శాస్త్రవేత్త మనీష్ జానీ పేర్కొన్నారు. అలాగే బనస్కాంత, వల్సాద్ బరూచ్‌లలో పోటాపోటీ ఉందని చెప్పారు.

ప్రతిపక్షాలకు అవకాశాలు..

జానీ ప్రకారం..రాజ్‌కోట్‌లో కాంగ్రెస్‌కు చెందిన పరేష్ ధనాని, వల్సాద్‌లో అనంత్ పటేల్, బనస్కాంతలో జెనిబెన్ ఠాకోర్, అలాగే భావ్‌నగర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉమేష్ మక్వానా, భరూచ్‌లో చైటర్ వాసవ వంటి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో బనస్కాంత మినహా అన్ని స్థానాల్లో 2019 కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడం వల్ల మరో కారణమని పేర్కొన్నారు.

అన్ని స్థానాల్లో కనీసం 40 శాతం ఓటింగ్‌ జరగాలన్నది బీజేపీ లక్ష్యం. “కానీ కొన్ని స్థానాలు, ముఖ్యంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. అధిక పగటి ఉష్ణోగ్రత కారణంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోయిండవ్చని జానీ పేర్కొన్నారు.

‘బీజేపీ గెలుపు ఖాయం’

వాస్తవానికి బిజెపి చాలా నమ్మకంగా ఉంది. రాజ్‌కోట్ అగ్నిప్రమాదంలో చిన్నారులు సహా 32 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జూన్ 4న పార్టీ వేడుకలు నిర్వహించబోమని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు.

మోదీ క్యాబినెట్‌ మంత్రులు అమిత్‌ షా, మన్‌సుఖ్‌ మాండవియా, పర్‌షోత్తమ్‌ రూపాలతోపాటు రాష్ట్ర మంత్రి దేవ్‌సింగ్‌ చౌహాన్‌ సహా 265 మంది అభ్యర్థుల భవితవ్యం జూన్‌ 4న ఖరారు కానుంది.

గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, సెంట్రల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెస్ట్, సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్, దక్షిణ గుజరాత్‌లోని వల్సాడ్ మరియు ఉత్తర గుజరాత్‌లోని బలమైన కీలక సీట్లు.

రాష్ట్రంలోని 26 నియోజకవర్గాల్లో 25 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, అర్హత గల 9 మంది అభ్యర్థులలో 8 మంది తమ నామినేషన్ ఫారమ్‌లను ఉపసంహరించుకోవడంతో అధికార బీజేపీ సూరత్ స్థానాన్ని ఏకపక్షంగా కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌ను విజేతగా ప్రకటించారు.

కీలక స్థానాలు..

గాంధీనగర్..

2019లో బీజేపీకి చెందిన అమిత్ షా 5.57 లక్షల ఓట్లతో కాంగ్రెస్‌కు చెందిన సీజే చావ్డాపై విజయం సాధించారు. మొత్తం ఓట్లలో బీజేపీకి 43.38 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సీటు బీజేపీకి కీలక స్థానం. ఇంతకు ముందు పార్టీ సీనియర్ ఎల్‌కె అద్వానీ ఇక్కడి నుంచి గెలుపొందారు.

అహ్మదాబాద్ తూర్పు..

2019లో బీజేపీ అభ్యర్థి సోమాభాయ్ పటేల్ 7.45 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గీతాబెన్ పటేల్‌పై విజయం సాధించారు. మొత్తం ఓట్లలో బీజేపీకి 55 శాతం ఓట్లు వచ్చాయి.

అహ్మదాబాద్ వెస్ట్..

2019లో బిజెపికి చెందిన కిరీట్ పి సోలంకి 3.21 లక్షల ఓట్లతో కాంగ్రెస్‌కు చెందిన రాజు పర్మార్‌పై విజయం సాధించారు. బీజేపీ ఓట్ల శాతం 64.21 శాతం.

రాజ్‌కోట్..

1989 నుంచి ప్రతి సారి ఇక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. 2009లో మాత్రం కాంగ్రెస్ నాయకుడు కున్వర్జీ బవాలియా గెలిచారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2014, 2019లో బీజేపీకి చెందిన మోహన్‌భాయ్ కుందారియా కాంగ్రెస్‌కు చెందిన కగతార లలితభాయ్‌పై విజయం సాధించారు. 2019లో మొత్తం ఓట్లలో 30.82 శాతం. 2019లో బీజేపీకి 63.42 శాతం ఓట్లు వచ్చాయి.

భరూచ్..

మూడు దఫాలుగా బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. సీట్ షేరింగ్ భాగంగా ఈ సారి ఈ స్థానం ఆప్‌ చేజిక్కించుకుంది. ఆప్ నుంచి పోటీచేసిన మన్సుఖ్ వాసవ మేనల్లుడు చైటర్ వాసవకు గిరిజనుల్లో ప్రజాదరణ ఉండడంతో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి.

భావ్‌నగర్..

కోలీ పటేళ్లు, క్షత్రియుల ఆధిపత్యం ఉన్న ఈ స్థానం 2014 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఆ తర్వాత 2019లో BJP గెలిచి విజయాన్ని పునరావృతం చేసింది. కాంగ్రెస్ అనుభవజ్ఞుడు, GPCC చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ సొంత జిల్లా కూడా. కూటమిలో భాగంగా ఈ స్థానం ఆప్‌కి దక్కింది. AAP ఉమేష్ మక్వానా, ఒకప్పుడు బిజెపి నాయకుడు. మొదటిసారి పోటీ చేస్తున్న జిల్లా మాజీ మేయర్ భారతి షియాల్‌తో తలపడ్డారు. మక్వానా రాష్ట్ర ఎన్నికలలో బొటాడ్ (భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో) నుండి గెలుపొందారు. భావ్‌నగర్ గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది. 

Tags:    

Similar News