జార్ఖండ్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం 46.25

జార్ఖండ్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ 46.25 శాతంగా నమోదైంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలిదశలో పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-13 11:15 GMT

జార్ఖండ్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ 46.25 శాతంగా నమోదైంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలిదశలో పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 683 మంది అభ్యర్థులు, ఆరుగురు కేబినెట్ మంత్రులతో పాటు 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 జిల్లాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే 950 కేంద్రాల్లో ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని, ఆ సమయానికి క్యూలో నిలుచున్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారి తెలిపారు.

తొలి దశ పోలింగ్‌లో సెరైకెల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ తొలిసారిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, జంషెడ్‌పూర్ ఈస్ట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ జంషెడ్‌పూర్ ఎస్పీ అజోయ్ కుమార్ బీజేపీ అభ్యర్థి పూర్ణిమా దాస్‌ సాహుతో తలపడుతున్నారు. సాహు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు.

ఉదయం నుంచే బారీ క్యూలు..

ఇక వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రియాంక సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అతను రాయ్ బరేలీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.  

Tags:    

Similar News