జమ్ము కాశ్మీర్‌లో కొనసాగుతున్న పోలింగ్

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మంగళవారం (అక్టోబర్ 1) మూడో, చివరి విడత పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు ఓటింగ్ శాతం 56.01గా నమోదైంది.

Update: 2024-10-01 11:35 GMT

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మంగళవారం (అక్టోబర్ 1) మూడో, చివరి విడత పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు ఓటింగ్ శాతం 56.01గా నమోదైంది. ఉత్తర కాశ్మీర్‌ పరిధి మూడు సరిహద్దు జిల్లాల్లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లు, జమ్మూ ప్రాంతంలోని 24 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్‌తో సహా 415 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని 39.18 లక్షల మంది ఓటర్లు నిర్ణయిస్తారు.

నియోజకవర్గాల వివరాలు..

బారాముల్లా, ఉరి, రఫియాబాద్, పట్టాన్, గుల్మార్గ్, సోపోర్, వాగూరా-క్రీరీ (బారాముల్లా జిల్లా), కుప్వారా, కర్నా, ట్రెహ్‌గామ్, హంద్వారా, లోలాబ్, లాంగటే (కుప్వారా జిల్లా), బందిపోరా, సోనావారి, గురేజ్ (బందీపోరా జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 16 సెగ్మెంట్లలో మొత్తం 202 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

రామన్ భల్లా (ఆర్‌ఎస్‌ పురా), ఉస్మాన్‌ మాజిద్‌ (బందిపొర), నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌ (గురేజ్‌), తాజ్‌ మొహియుద్దీన్‌ (ఉరీ), బషరత్‌ బుఖారీ (వాగూరా-క్రీరీ), ఇమ్రాన్‌ అన్సారీ (పట్టాన్‌) ఈ దశలో బరిలో నిలిచారు. , గులాం హసన్ మీర్ (గుల్మార్గ్), చౌదరి లాల్ సింగ్ (బసోహ్లీ), రాజీవ్ జస్రోటియా (జస్రోటా), మనోహర్ లాల్ శర్మ (బిల్లవార్), షామ్ లాల్ శర్మ, మరియు అజయ్ కుమార్ సధోత్ర (జమ్మూ నార్త్) పోటీపడుతున్న వారిలో ఉన్నారు.

గట్టి భద్రత..

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల కమిషన్ గట్టి భద్రతా ఏర్పాటు చేసింది. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పారామిలటరీ, సాయుధ పోలీసు సిబ్బందితో భద్రతా దళాలను రంగంలోకి దించింది.

మొదటి దశ ఎన్నికలు సెప్టెంబరు 18న జరిగాయి. ఓటింగ్ శాతం 61.38గా నమోదయ్యింది. సెప్టెంబర్ 25న జరిగిన రెండో విడతలో పోలింగ్ శాతం 57.31గా రికార్డయ్యింది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

5వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు..

ఎన్నికల సంఘం మొత్తం 5,060 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 974 పట్టణ పోలింగ్‌ కేంద్రాలు కాగా, 4,086 గ్రామీణ పోలింగ్‌ కేంద్రాలు. ఇందులోనే 240 "ప్రత్యేక" పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. కేవలం మహిళలకు 50 "పింక్" పోలింగ్ స్టేషన్‌లు, దివ్యాంగుల కోసం 43 పోలింగ్ స్టేషన్లు కేటాయించారు. కాగా

కాశ్మీర్ డివిజన్‌లోని వలస ఓటర్ల కోసం 24 పోలింగ్ స్టేషన్లు, జమ్మూలో 19, ఢిల్లీలో నాలుగు, ఉధంపూర్ జిల్లాలో ఒకటి ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News