‘ఎన్నికల ఫలితాల తర్వాత ఖర్గే ఉద్యోగం పోతుంది’

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తన పదవిని కోల్పోతారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఓటమిని ఈవీఎంల మీదకు నెడతారని పేర్కొన్నారు.

Update: 2024-05-27 12:45 GMT

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన పదవిని కోల్పోతారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధ్యుల్ని చేయకుండా , వారి పరాజయాన్ని ఈవీఎంల మీదకు నెడుతారని పేర్కొన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా, చందౌలీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో షా ప్రసంగించారు.

గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. "ఇప్పటిదాకా జరిగిన ఐదు దశల ఎన్నికలలో ప్రధాని మోదీ 310 సీట్లు దాటారు. జూన్ 4న రాహుల్‌కు 40, అఖిలేష్ యాదవ్‌కు 4 సీట్లు కూడా రావు" అని వ్యాఖ్యానించారు.

ఎస్పీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతూ.. పేద కుటుంబంలో జన్మించిన ప్రధాని మోదీకి ప్రజా సంక్షేమం నుంచి తెలుసని, వెండి చెంచాతో పుట్టిన రాహుల్, అఖిలేష్‌కు పూర్వాంచల్ (తూర్పు యూపీ) ప్రజలు సమస్యల గురించి తెలియదన్నారు.

దేశంలోని వాతావరణం నచ్చలేదని, రాహుల్‌ ఆరు నెలలకోసారి సెలవుపై థాయ్‌లాండ్‌ వెళ్తారని, అయితే మోదీ ఇప్పటి వరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదని చెప్పారు.

రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. మోడీ ఎప్పుడూ అలాంటి ఆరోపణలను ఎదుర్కోలేదన్నారు.

‘ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోదీపై 25 పైసల అవినీతి ఆరోపణ రాలేదని, ఇద్దరు ‘షెహజాదే’ (రాహుల్, అఖిలేష్)లు రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.

సహారా గ్రూపును ప్రస్తావిస్తూ.. "అఖిలేష్ పార్టీ సహారా ఫండ్ నుండి నడిచేది. వారి (ఎస్‌పి) హయాంలో స్కామ్ జరిగింది. ప్రజల సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియను మేం ప్రారంభించాం. గత పాలనలో "ఒక జిల్లా ఒక మాఫియా" ఉండేదని, అయితే ఇప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" పథకం ఉందని పేర్కొన్నారు.

గత ఎస్పీ-బీఎస్పీ హయాంలో చక్కెర మిల్లులు మూతపడ్డాయని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు చెరకు బకాయిలు చెల్లించిందని షా అన్నారు.

సభనుద్దేశించి మాట్లాడుతూ..ప్రతిపక్షాన్నిగెలిపిస్తే వారు దళితులు, వెనుకబడిన, గిరిజనుల రిజర్వేషన్‌లను తీసివేసి ముస్లింలకు ఇస్తారని చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు అనుమతించం" అని షా స్ఫష్టం చేశారు.

ఐదేళ్ల పదవీకాలంలో ప్రతి సంవత్సరం ఒకరిని ప్రధానమంత్రిని చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని చెప్పారు. భారత కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370ని అమలు చేస్తాయని, ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్‌ను వెనక్కి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఆర్టికల్ 370పై "రాహుల్ (గాంధీ) ఆర్టికల్ 370 రద్దు గురించి తనను బెదిరించేవారని, రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుందని చెప్పేవాడని, అయితే రద్దు తర్వాత ఎవరూ దాడి చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. అన్నారు.

"పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఎవరు ఇవ్వగలరు? కోవిడ్ నుండి మిమ్మల్ని రక్షించగలరు? ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఎవరు అంతం చేయగలరు? అని షా ప్రశ్నించారు.

రామ మందిర అంశాన్ని లేవనెత్తిన హోంమంత్రి.. 70 ఏళ్లుగా ఆలయ సమస్యను కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఎస్పీ ప్రభుత్వం రామభక్తులపై కాల్పులు జరిపిందని ఆరోపించారు. మోదీ జీ ఆలయానికి భూమి పూజ చేయడమే కాకుండా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారని, కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరించారని చెప్పారు. సోమనాథ్ ఆలయానికి బంగారు ఫలకాల ఏర్పాటుకు కూడా మోదీ కృషి చేశానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ అణుబాంబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 'బీజేపీ ప్రజలు అణుబాంబులకు భయపడరు. పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) మాది. దానిని వెనక్కి తీసుకుంటాం' అని షా అన్నారు.

సేలంపూర్ నియోజకవర్గం కోసం బల్లియాలో మరియు చందౌలీలో జరిగిన ఎన్నికల సమావేశాలలో కూడా షా ప్రసంగించారు.

బల్లియా, చందౌలీ స్థానాలకు జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. 

Tags:    

Similar News