ఖర్గే బహిరంగ లేఖ..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓట్ల లెక్కింపులో పాల్గొనే యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. అందులో ఏమని కోరారు.

Update: 2024-06-04 04:42 GMT

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశంలోని అధికార యంత్రాంగానికి బహిరంగ లేఖ రాశారు. అధికారులు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. నిర్భీతిగా, పక్షపాతధోరణి లేకుండా వ్యవహరించాలని కోరారు.

“ఎవరికీ బెదిరొద్దు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించొద్దు. కౌంటింగ్ రోజున నిజాయితీగా విధులు నిర్వర్తించండి" అని లేఖలో పేర్కొన్నారు.

కౌంటింగ్‌కు ముందు దేశవ్యాప్తంగా 150 మంది జిల్లా మేజిస్ట్రేట్‌లకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అభియోగాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) తోసిపుచ్చింది.

సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పాలుపంచుకున్న ఈసీ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు, సివిల్ సర్వెంట్లు, జిల్లా కలెక్టర్లు, వాలంటీర్లు, అధికార యంత్రాంగంలోని ప్రతి ఒక్కరినీ ఖర్గే అభినందించారు.

Tags:    

Similar News