‘ప్రజాశక్తి కంటే మరో బలమైన శక్తి లేదు’

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం లోక్‌సభ స్థానాలు 80. ఇండియా కూటమికి 43 స్థానాలు దక్కాయి. ఇందులో సమాజ్‌వాదీ 37 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది.

Update: 2024-06-05 07:54 GMT

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సంబరాలు జరుపుకుంటోంది. ఆ పార్టీ చీఫ్ కు ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ గెలుపు వెనుకబడిన తరగతులు, దళితులు మైనారిటీల విజయమని పేర్కొన్నారు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ప్రజల కంటే మరో బలమైన శక్తి లేదన్నారు. యూపీ ఓటర్లు తెలివైన వారని పొగిడారు.

సమాజ్ వాదీకి 37 సీట్లు..

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం లోక్‌సభ స్థానాలు 80. ఇండియా కూటమి అభ్యర్థులు 43 స్థానాల్లో గెలుపొందారు. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది.

ఈ సారి బీజేపీకి షాక్.

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికయ్యారు. అయితే ఈ సారి ఆ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. 2019 ఎన్నికల్లో సొంతంగా 62 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి ఏకంగా 29 స్థానాల్లో వెనుకంజలో ఉండటం గమనార్హం. 2019లో ఒక్కసీటుకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి 6 స్థానాలు గెలుచుకుంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాలకే పరిమితపరిమితమైన ఎస్పీ..ఈసారి ఏకంగా దాదాపు 37 సీట్లు సాధించింది. మొత్తం 80 స్థానాల్లో కాంగ్రెస్‌కు 18 సీట్లు, టీఎంసీకి ఒక స్థానాన్ని కేటాయించి, మిగిలిన చోట్ల తన అభ్యర్థులను నిలబెట్టారు అఖిలేష్. ఎస్పీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ఎంపీ సీట్లు సాధించారు.

Tags:    

Similar News