లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్?

లోక్‌సభలో రాహుల్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించ బోతున్నారా? సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి?

Update: 2024-06-08 11:06 GMT

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం (జూన్ 8) రెండు తీర్మానాలను ఆమోదించింది. అందులో మొదటిది లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ను కొనసాగించాలని తీర్మానించారు. అయితే దీనిపై ఆలోచించి, నిర్ణయం తీసుకుంటానని రాహుల్ చెప్పినట్లు సమాచారం.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ మాట్లాడారు. పదేళ్ల పాలనను తిరస్కరించిన దేశ ప్రజలకు అభినందనలు తెలపడమే సీడబ్ల్యూసీ తొలి తీర్మానం అని పేర్కొన్నారు. రెండోది లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ కొనసాగుతారని చెప్పారు.  

యోధుల్లా పోరాడాం..

‘‘మా పార్టీ ఖాతాలను స్తంభింపజేసినా, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడినా, నాయకులను బెదిరింపులకు గురిచేసినా.. బీజేపీకి ఎదురునిలిచాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి యోధుల్లా పోరాడం. కమలనాథుల అసలు రూపాన్ని చూసిన జనం వారికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పారు.’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు.

పనితీరుపై సమీక్ష..

“మేము బాగా పనిచేయని రాష్ట్రాల్లో ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మేం రాణించని రాష్ట్రాల్లో ఫలితాలను విశ్లేషించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక కమిటీని వేస్తారు’’ అని వేణుగోపాల్ చెప్పారు. పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ.. “ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రచారంలో లేవనెత్తిన ఇతర అంశాలకు కట్టుబడి ఉండాలని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. 

పార్టీ పనితీరు సంతృప్తికరంగా లేని ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని రమేష్ చెప్పారు. దీనిపై సమీక్ష నిర్వహించి తుది నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందజేస్తామని తెలిపారు.

Tags:    

Similar News