రాహుల్ భావోద్వేగ లేఖ..
రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. అందులో ఏం ఉంది?
రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. ‘నేను ఎవరో మీకు తెలియదు. అయితే నన్ను ఆదరించి గెలిపించారు. నా మీద ప్రేమానురాగాలు చూపిన మిమ్మల్ని వదులుకుంటున్నందుకు బాధగా ఉంది. ఇన్ని రోజులు మీరిచ్చిన సహకారానికి నా కృతజ్ఞతలు. మీరు ప్రియాంకను ఎంపీగా ఎన్నుకుంటే బాగా పనిచేస్తుంది. ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయమని నేనే ఒప్పించా. దేశంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టేవారిపై కలిసి పోరాడదాం’అని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో (వాయనాడ్, రాయ్‌బరేలీ) గెలుపొందారు. ఇందులో ఏదో ఒకదాని నుంచే మాత్రమే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దాంతో ఆయన కేరళలోని వయనాడ్ ను వదులుకున్నారు. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీని పోటీ చేయిస్తున్నారు.