వయనాడ్ మూడో దశ ప్రచారంలో ప్రియాంకతో రాహుల్‌

వయనాడ్‌లో ప్రియాంక మూడో దశ ఎన్నికల ప్రచారం నవంబర్ 3న ప్రారంభమవుతుంది. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు.

Update: 2024-11-03 13:02 GMT

వయనాడ్‌లోని చాలా మందిలాగే.. 38 ఏళ్ల గృహిణి, ముగ్గురు పిల్లల తల్లి అయిన సౌదాబీ ఇబ్రహీం.. మలప్పురం జిల్లాలోని చుంగతారాలో కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాను కలవడానికి ఆసక్తిగా వేచిచూశారు. నవంబర్ 29న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌కు హాజరైన ప్రియాంకను తాను కలుసుకోలేకపోయానని సౌదాబీ కాస్త నిరాశకు లోనయ్యారు.

‘‘రాహుల్ గాంధీని కూడా చూడాలని ఆశపడ్డాను. కానీ ఆయన అక్కడ లేరు’’ అని సౌదాబీ పేర్కొన్నారు. లేత నీలం రంగు చురీదార్ ధరించిన ప్రియాంక తన గాంభీర్యం, స్నేహపూర్వక ప్రవర్తనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

"నేను మా అత్తను చూసేందుకు నిలంబూరు సమీపంలోని ఎడవన్న నుంచి ఇక్కడకు వచ్చాను. రాహుల్, ప్రియాంక ఇద్దరినీ కలిసి వారి చేతులు తాకాలన్నది నా చిరకాల కోరిక." అని సౌదాబీ తన మనసులో మాటను బయటపెట్టారు.

చారిత్రక బంధం చాటుతూనే..

ఇక వయనాడ్ ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ప్రియాంక తన ప్రసంగాలలో గాంధీ కుటుంబానికి, నియోజకవర్గానికి మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. సత్యం కోసం తన సోదరుడు రాహుల్ చేస్తున్న పోరాటానికి వయనాడ్ ఓటర్లు ఎలా మద్దతు ఇచ్చారో పదే పదే చెబుతున్నారు. మనంతవాడిలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. "నా సోదరుడికి వ్యతిరేకంగా దుష్రచారం జరిగినప్పుడు, నిజం కోసం పోరాడుతున్నాడని మీరు అర్థం చేసుకున్నారు.’’ అని ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు.

ఇంకా ఉద్యోగాల కొరత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు. "రాహుల్ గాంధీ మార్గం చూపారు. మీ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తారు." వయనాడ్ మెడికల్ కాలేజీలో సౌకర్యాలను మెరుగుపరచడం, కొత్త రోడ్లను నిర్మించడంలో ప్రియాంక నిబద్ధత స్థానిక అవసరాలపై ఆమెకున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది.

మూడో దశ ప్రచారం..

అక్టోబరు 23న నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక అక్టోబర్ 28వ తేదీ వరకు ప్రచారం చేయలేదు. రెండు రోజులు తిరిగి వయనాడ్, మలప్పురం జిల్లాల్లో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఇక ఆమె మూడో దశ ప్రచారం నవంబర్ 3న ప్రారంభమై 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ దశలో రాహుల్ ఆమెతో కొన్ని సమావేశాలలో పాల్గొంటున్నారు. వివిధ ప్రదేశాలలో స్వతంత్ర ర్యాలీలకు హాజరవుతారు.

ప్రచారంలోని యూడీఎఫ్ నేతలు..

ప్రియాంక నియోజకవర్గంలో లేని సమయంలో స్థానిక యుడీఎఫ్ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రచారం ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వయనాడ్‌లో యుడీఎఫ్ ఎమ్మెల్యే టి సిద్ధిక్‌, మలప్పురంలో కేరళ మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్, ఐయూఎంఎల్‌కు చెందిన పీకే బషీర్ ప్రియాంక కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

వయనాడ్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందినవి. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మూడు సెగ్మెంట్‌లను గెలుచుకుంది. ఇక ఎల్‌డీఎఫ్ నుంచి వైదొలిగిన పీవీ అన్వర్ తాను కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ సంస్థ డీఎంకే తరుపున చెలక్కర నియోజకవర్గంలో అభ్యర్థిని పోటీలో నిలబెట్టారు. అయితే తరువాత ప్రియాంకకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. మనంతవాడి, తిరువంబాడి నియోజకవర్గాలకు మంత్రి OR కేలు, లింటో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జోసెఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బూత్ స్థాయి సమావేశాలు..

బూత్-స్థాయి సమావేశాలు UDF వ్యూహంలో ఒక భాగం. “రాహుల్ గాంధీ మొదటిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు 2019లో మేం సరైన విధానాన్ని అనుసరించాం. ప్రియాంక భౌతికంగా లేకపోయినా..వయనాడ్ పట్ల ఆమె దృష్టి ఓటర్లలో సజీవంగా ఉండేలా ప్రయత్నిస్తున్నాం” అని టి సిద్దిక్ చెప్పారు.

సీఎం ఘాటు విమర్శలు..

‘‘గతంలో మైనారిటీలను ప్రసన్నం చేసుకున్నారు. ఇప్పుడు హిందువులను మభ్యపెడుతున్నారు’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేసిన ఘాటు విమర్శల నేపథ్యంలో ప్రియాంక తన ప్రసంగాలకు తన సోదరుడిని తీసుకురావడంపై దృష్టి సారించింది. వయనాడ్‌లో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతానంటూనే.. సీఎం పినరయి విజయన్‌ పేదల సంక్షేమం మరిచిపోయారని ఆరోపించారు.

"వయనాడ్ ప్రజల అభ్యున్నతి నా ప్రధాన అజెండా. వారి సమస్యల కోసం పోరాడతా. నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ గొంతుకనవుతా. మెరుగైన జీవనం గడిపేందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను.” అని నవంబర్ 3‌న ప్రచారాన్ని ప్రారంభించే ముందు ప్రియాంక అన్నారు.

ప్రియాంక ప్రచారం ఆమె ఎన్నికల అరంగేట్రానికి మాత్రమే కాకుండా కేరళలో కాంగ్రెస్ విస్తృత వ్యూహానికి శ్రీకారం చుడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News