ఫడ్నవీస్‌తో బీజేపీ సీనియర్ నేతల భేటీ
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 230 సీట్లను కైవసం చేసుకుని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి శనివారం అధికారాన్ని నిలబెట్టుకుంది.
By : The Federal
Update: 2024-11-24 08:37 GMT
బీజేపీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాష్, మహారాష్ట్ర యూనిట్ హెడ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ఆదివారం ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 230 సీట్లను కైవసం చేసుకుని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి శనివారం అధికారాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో పోటీ చేసిన 149 సీట్లలో 132 కైవసం చేసుకోవడంతో తమ పార్టీ అద్భుతమైన విజయానికి రూపశిల్పి అయిన బీజేపీ నేత ఫడ్నవీస్‌పై అందరి దృష్టి మళ్లింది. రాష్ట్రానికి చెందిన రెండో బ్రాహ్మణుడు సీఎం కానున్నాడని, మూడోసారి సీఎం పదవి చేపడతారని వార్తలొస్తు్న్నాయి. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం మంగళవారంతో ముగుస్తుంది. ముఖ్యమంత్రి పదవికి పేరును ఖరారు చేయడానికి అధికార మిత్రపక్షాల నాయకుల మధ్య సమావేశాలు కూడా అవసరం.