బారామతిలో విడివిడిగా శరద్ పవార్, అజిత్ పవార్ ‘దీపావళి పడ్వా’

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక.. రెండు పవార్ కుటుంబాల మధ్య దూరాన్ని పెంచింది. ఇరు కుటుంబాలు కలిపి జరుపుకునే దీపావళి వేడుకలపై కూడా ప్రభావం చూపింది.

Update: 2024-11-02 07:26 GMT

'దీపావళి పడ్వా'ను శరద్ పవార్, అజిత్ పవార్ కుటుంబాలు కలిసి బారామతిలోని 'పవార్ సాహెబ్' గోవింద్‌బాగ్ నివాసంలో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఈ రెండు కుటుంబాలు కలిసి వేడుకలకు జరుపుకోవడం లేదు. విడివిడిగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది మాత్రం గోవింద్‌బాగ్ నివాసంలో ఈ వేడుకను కలిసి జరుపుకున్నా.. మహాయుతి కూటమి భాగస్వాములు బీజేపీ, షిండే సేనతో అజిత్ చేతులు కలపడంతో అజిత్, శరత్ పవార్ విడివిడిగానే ప్రజలను కలిశారు.

కటేవాడిలో అజిత్ దీపావళి పడ్వా..

ఉప ముఖ్యమంత్రి NCP అధినేత అజిత్ పవార్ దీపావళి పడ్వాను బారామతిలోని తన స్వగ్రామం కటేవాడిలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు నిర్వహిస్తున్నారు. తన తల్లి, భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో భాగంగా అజిత్ గ్రామస్థులు, NCP కార్యకర్తలను కూడా కలుస్తారు. కాటేవాడి శరద్ పవార్ గోవింద్‌బాగ్ నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కటేవాడిలో జరిగే వేడుకలకు సునీల్ తట్కరే, ధనంజయ్ ముండే వంటి నాయకులు హాజరవుతున్నాని అజిత్ పవార్ తెలిపారు.

శరత్ పవార్ మాత్రం గోవింద్‌బాగ్‌ నివాసంలోనే..

NCP (SP) అధినేత శరద్ పవార్ మాత్రం తన భార్య ప్రతిభ, కుమార్తె సుప్రియా సూలే, మనవడు రోహిత్ పవార్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బారామతిలోని గోవింద్‌బాగ్ నివాసంలో దీపావళి పడ్వా జరుపుకోనున్నారు. శరద్ పవార్ ఇంట్లో జరిగే వేడుకల్లో అజిత్ పవార్ అన్నయ్య శ్రీనివాస్ పవార్ కూడా పాల్గొననున్నారు.

సీనియర్ పవార్ చుట్టూ బంధువులు..

దీపావళి వేడుకలలో ఇద్దరు పవార్లు బారామతి బయట నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలను కలుసుకుంటారు. రెండు, మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు జరుగుతాయి. శరద్ పవార్‌ను అజిత్ "ద్రోహం" చేశాడన్న కారణంతో పవార్ కుటుంబ సభ్యులలో ఎక్కువ మంది శరద్ పవార్‌ను మాత్రమే కలిసేందుకు ఇష్టపడుతున్నారు.

ఆ ఈవెంట్ గురించి తెలియదు: సులే

అయితే కటేవాడిలో అజిత్ పవార్ నిర్వహించే దీపావళి పడ్వా గురించి శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న కార్యక్రమం గురించి తనకు సమాచారం లేదన్నారు. గోవింద్‌బాగ్‌లో నిర్వహించే వేడుకల కోసం అందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. “రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పవార్ సాహెబ్‌ను అభినందించడానికి వస్తున్నారు. ఈ సంతోషకరమైన రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మరో దీపావళి పడ్వా (అజిత్ పవార్ నివాసంలో ఉన్నది) గురించి నాకు తెలియదు.’’ అన్నారు సూలే.

'దీపావళి పడ్వా' ఎలా మొదలైంది?

1967లో తొలిసారి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు శరద్ పవార్ బారామతి నివాసంలో దీపావళి పడ్వా నిర్వహించారు. ఇదే ఆ తర్వాత సంప్రదాయంగా మారిపోయింది. మొదట్లో ఈ వేడుకను కుటుంబ సమేతంగా నిర్వహించుకునేవారు. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పాల్గొనడం మొదలైంది. క్రమేణా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యులు, మద్దతుదారులను ఆకర్షించింది. రాష్ట్రంలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవార్ కుటుంబాలు విడివిడిగా జరుపుకుంటున్నాయి.

గత సంవత్సరం అజిత్ ఈ ఈవెంట్‌ నిర్వహించలేదు. అయితే శరద్ పవార్‌తో సంబంధాలను ఇంకా కొనసాగిస్తున్నారన్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ కుటుంబం సభ్యులు నిర్వహించిన భౌబిజ్ వేడుకలో కనిపించారు.

కుటుంబాల మధ్య చీలికలు..

ఎన్‌సీపీలో చీలికల కారణంగా పవార్ల కంచుకోట బారామతిలో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో రెండు కుటుంబాలు వేర్వేరు కూటముల తరుపున ప్రచారం చేయనున్నాయి.

లోక్‌సభ ఎన్నికలలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి గెలుపొందారు. 1.5 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. ఇక్కడి నుంచి అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్‌ను నిలబెట్టారు. ఆయితే ఆమె ఓడిపోయింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో తమ అభ్యర్థులను వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించుకోవడం ద్వారా శరత్ పవార్‌కు ఛాలెంజ్ విసురుతున్నారు అజిత్.

Tags:    

Similar News