Maharashtra Politics | రెండురోజుల్లో సీఎం పేరు ఖరారు..

ముఖ్యమంత్రి ఎవరన్నది రెండు రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే, ఆయన డిప్యూటీలు ఫడ్నవీస్, అజిత్ పవార్ ఢిల్లీలో అమిత్‌షాతో చర్చించారు.

Update: 2024-11-29 06:44 GMT

మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడలేదు. మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినందును సీఎం సీట్లో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌‌ను కూర్చోపెడతారన్న వార్తలోచ్చాయి. అయితే ఈ సారి కూడా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగుతారని ఆయన వర్గీయుల వాదన. ఇక సీఎం ఎంపిక బాధ్యతను కేంద్రం తీసుకుంది. అందులో భాగంగానే మహారాష్ట్ర సీఎం షిండే, ఆయన డిప్యూటీలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌ను నిన్న ఢిల్లీకి రావాలని అధిష్ఠానం కోరింది. వారంతా కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ నడ్డాను కలిశారు. సమావేశం ముగిసిన అనంతరం షిండే మాట్లాడుతూ..‘‘అమిత్ షాతో చర్చలు సానుకూలంగా జరిగాయి. మేము ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాము. అంతకంటే ముందు మహాయుతి కూటమి మరో సమావేశం ముంబైలో ఉండబోతుంది. అందులో తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    

Similar News