బెంగళూరులో రాహుల్ సమీక్ష సమావేశం దేనిపై?

బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? అసలు ఆయన దేనిపై సమీక్షించారు.

Update: 2024-06-07 10:10 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరుకు వచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఓడిపోయిన పార్టీ అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ స్థానాలు గెలుపొందడంపై వారితో చర్చించారు. 28 లోక్‌సభ స్థానాలకుగాను కేవలం 9 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 17 స్థానాల్లో, దాని మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) రెండు స్థానాలను దక్కించుకుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా హాజరయ్యారు.

బెయిల్ మంజూరు..

పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరయిన రాహుల్ గాంధీకి స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కేఎన్‌ శివకుమార్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే కేసు విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేశారు.

డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కేశవ్‌ ప్రసాద్‌ రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు.ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు.

Tags:    

Similar News