మహారాష్ట్రలో మహాయుతి విజయ రహస్యం ఏమిటి?

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో భారీ మెజారిటీతో విజయం సాధించింది.

Update: 2024-11-24 10:21 GMT

ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ సారి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇటు జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ జెఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యతను చాటింది.

మహారాష్ట్రలోని మహాయుతి 288 స్థానాలలో 230 స్థానాలను కైవసం చేసుకుంది. మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవిఎ) కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), ఉద్ధవ్ థాకరే శివసేనతో కూడిన ఎంవిఎ పూర్తిగా వెనకబడి పోయింది. మహారాష్ట్రలో

లాడ్లీ బెహనా యోజన (ఎల్‌బివై) పథకం మహిళా ఓటర్లను బాగా ఆకర్షించిందని చెప్పాలి. ఇక భారీ విజయానికి కూటమికి ఏ అంశాలు కలిసొచ్చాయో నీల్ వ్యాస్ హోస్టుగా వ్యవహరిసున్న ది ఫెడరల్ ‘‘క్యాపిటల్ బీట్ ’’ డిబేట్‌లో డాక్టర్ సందీప్ యాదవ్, ఫ్రంట్‌లైన్ సీనియర్ డిప్యూటీ ఎడిటర్ టికే రాజ్యలక్ష్మి, ప్రొ. శశి శేఖర్ సింగ్ పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

బీజేపీ తన సంస్థాగత బలం, స్పష్టమైన సందేశంతో ఓటర్ల వద్దుకు వెళ్లిందని ది ఫెడరల్ సీనియర్ ఎడిటర్ పునీత్ నికోలస్ యాదవ్ ఇలా అన్నారు, కాగా ఈ సారి ఎన్నికలలో ధనబలం ఆరోపణలు బాగా వచ్చాయని పేర్కొన్నారు.

Full View


మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమిపాలు కావడానికి కారణాలను చెప్పుకోవాల్సి వస్తే..పొత్తుపై నాన్చడం, అభ్యర్థుల పేర్లను ఆలస్యంగా ప్రకటించడం కూడా ఓటమికి కారణం అని డిబేట్‌లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ నాయకత్వం జనాల నుంచి డిస్‌కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది ప్రొఫెసర్ శశి శేఖర్ సింగ్ అన్నారు. పునాది బలంగా లేకుండా బీజేపీని ఎదుర్కోలేరని చెప్పారు.

ఇక జార్ఖండ్‌లో జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కూటమి 56 స్థానాలను దక్కించుకుంది. ఇది వారి 2019 ఫలితాల కంటే ఎక్కువ. 46 కంటే మెరుగుదల. హేమంత్ సోరెన్ ప్రభుత్వం గిరిజన, గ్రామీణ ఓటర్లతో బలమైన సంబంధాన్ని కొనసాగించడంతో అక్కడ జేఎంఎం గెలుపొందిదని ఫ్రంట్‌లైన్ సీనియర్ డిప్యూటీ ఎడిటర్ టి.కె. రాజలక్ష్మి అన్నారు. హేమంత్ సోరెన్‌‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టుచేశారు. ఇది కొంతమంది ఓటర్ల మనస్సుల్లో సోరెన్ పట్ల సానుభూతిని రేకెత్తించింది.

Tags:    

Similar News