‘ప్రియాంక గెలిస్తే వయనాడ్‌లోనే ఉంటారా?’

"రాహుల్‌ను చూడండి. గెలిచి వెళ్లిపోయారు. ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఇలా పోటీ చేసి వెళ్లిపోతున్న వారు ప్రజలు సమస్యలను పరిష్కరించలేరు." - మోకేరి.

Update: 2024-10-19 13:05 GMT

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. పార్టీ సీనియర్ నాయకుడు మోకేరిని సీపీఐ ఇటీవలే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి యూడీఎఫ్ తరుపున, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్నారు. ఆమెను టార్గెట్ చేస్తూ ‘‘ప్రియాంక గెలిస్తే వయనాడ్‌లోనే ఉంటారా? ’’ అని ఓటర్లను ప్రశ్నించారు మొకేరి. అయితే ప్రియాంక ఇంకా ప్రచారాన్ని మొదలుపెట్టలేదు.

మొకేరి 2014లో వాయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐ షానవాస్ గెలుపు ఆధిక్యాన్ని దాదాపు 20,000 ఓట్లకు తగ్గించారు.

రాహుల్ గెలిచి వెళ్లిపోయారు..

"రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ చూడండి. గెలిచి వెళ్లిపోయారు. ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఇలా పోటీ చేసి వెళ్లిపోతున్న వారు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేరు." అన్నారు మోకేరి.

ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు బలంగా ఉన్న చోట నుంచి బలహీనంగా ఉన్న ఫాసిస్టు గ్రూపులు ఎందుకు పోటీ చేస్తున్నారన్న దానిపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నుంచి సమాధానం లేదని మొకేరి పేర్కొన్నారు.

కోజికోడ్ జిల్లాలోని నాదాపురం నియోజకవ మాజీ ఎమ్మెల్యే అయిన మొకేరి వ్యవసాయ రంగంలోని సమస్యలను పరిష్కరించడంలో మంచిపేరు సంపాదించారు.

రాహుల్ వయనాడ్‌ను వదులుకోవడంతో..

వయనాడ్‌, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గెలవడంతో ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది. వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. 

Tags:    

Similar News