‘రాష్ట్ర హోదా పునరుద్దరణకు కృషి చేస్తాం’

జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో విఫలమైతే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-09-23 12:20 GMT

జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో విఫలమైతే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెస్తామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనస్తత్వశాస్త్రాన్ని భారత కూటమి మార్చేసిందని పేర్కొన్నారు.

పూంచ్ జిల్లాలోని సూరంకోట్ ప్రాంతంలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.."దేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్‌ను ఢిల్లీ పాలిస్తోందని, స్థానికేతరులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మేం ప్రాధాన్యం ఇస్తాం. మతం, కులం, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించడానికి RSS-BJP ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.

''ప్రేమతోనే విద్వేషాన్ని అధిగమించగలం. ఒకవైపు విద్వేష వ్యాప్తి చేస్తు్న్నవారు, మరోవైపు ప్రేమను ప్రమోట్ చేస్తున్నవారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అందర్నీ కలుపుకొని వెళ్లి ప్రతి ఒక్కరి హక్కుల కోసం ముందుంటుంది. మాకు అందరూ సమానమే. ఎవరినీ వెనకబడనీయం'' అని రాహుల్ చెప్పారు.

జమ్మూకాశ్మీర్‌ ప్రజలతో సహా ఎవరు ఏ పని చేయమని తనను అడిగినా.. అ పని చేయడానికి సిద్ధమని, ఏ సమస్యనైనా పార్లమెంటులో ప్రస్తావించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 

90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ప్రస్తుతం మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం, అక్టోబర్‌ 1న రెండు, మూడో దశలకు పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags:    

Similar News