బీజేపీ ఓడిపోతే రాజీనామా చేస్తా: కిరోడీ లాల్ మీనా

రాజస్థాన్‌లో తాను ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు కేంద్ర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మంత్రి అయిన కిరోడి లాల్ మీనా.

Update: 2024-06-04 05:36 GMT
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా ఫైల్ ఫోటో

తాను బాధ్యత వహించిన ఏడు స్థానాల్లో బీజేపీ ఓటమి చెందితే తన పదవికి రాజీనామా చేస్తానని రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. ఏడు స్థానాలను గెలిపించే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తనపై పెట్టారని గుర్తుచేశారు.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మంత్రి అయిన కిరోడి లాల్ మీనా.. తూర్పు రాజస్థాన్‌లోని దౌసా, భరత్‌పూర్, ధోల్‌పూర్, కరౌలి, అల్వార్, టోంక్-సవాయిమాధోపూర్, కోట-బుండి స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు.

"ప్రధానమంత్రి దౌసాకు రాకముందే, (దౌసా) సీటు గెలవకపోతే మంత్రి పదవిని వదులుకుంటానని చెప్పాను. తరువాత ప్రధానమంత్రి నాతో విడిగా మాట్లాడి ఏడు సీట్ల జాబితా ఇచ్చారు. నేను కష్టపడి పనిచేశాను. 11 సీట్లలో ఏడింటిలో ఒక్క సీటు కూడా ఓడిపోతే నేను మంత్రి పదవిని వదులుకుంటా’’ అని అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలలో BJP నేతృత్వంలోని NDA మొత్తం 25 స్థానాలను గెలుచుకుంది. 2014 లో BJP అన్ని స్థానాలను గెలుచుకుంది. 

Tags:    

Similar News