జులై 2025 టాలీవుడ్ రిజల్ట్

బ్లాక్‌బస్టర్ హైప్... బాక్సాఫీస్ ఫ్లాప్!;

Update: 2025-08-05 11:43 GMT

జులై... పేరుకు మిడిల్ ఆఫ్ ది ఇయర్, కానీ తెలుగు బాక్సాఫీస్‌ కల కు మాత్రం మొండి చెయ్యి చూపించిన నెల! ఈ నెలలో ఎప్పటిలాగే ప్రతీవారం రిలీజ్‌ లు అవుతూనే ఉన్నాయి. కానీ నిలిచింది మాత్రం శూన్యం. ఓవర్‌వ్యూ లో చూస్తే, ఈ నెల ప్రేక్షకుల్ని మెప్పించిన సినిమాల కన్నా, నిరాశపరిచినవే ఎక్కువగా కనిపించాయి.

* వారం 1: “తమ్ముడు” పెద్ద దెబ్బ కొట్టాడు

నితిన్ నటించిన తమ్ముడు ఓ మోస్తరు ఓపెనింగ్‌తో స్టార్ట్ అయ్యింది. కానీ ఈ ఒక్కటీ నిలబడలేదు. షో టైమ్, 3 BHK, ఉప్పు కప్పురంబు (ఓటీటీ రిలీజ్) – ఇవన్నీ ప్రేక్షకుల చూపుకు ,లెక్కల్లోకి కూడా రాలేకపోయాయి.

* వారం 2: పేరుండి, పేసే లేని సినిమాల పరేడ్

ఓ భామ అయ్యో రామ, దీర్ఘాయుష్మాన్ భవ, విర్జిన్ బాయ్స్, మాలిక్, 100, సూపర్ మేన్… టైటిల్స్ ఆసక్తికరంగానే ఉన్నా, కంటెంట్ లేదు. ఒక్క సినిమా కూడా మౌత్ టాక్‌ని రాబట్టలేకపోయింది. రిలీజ్ అయిన మార్నింగ్ షోకే జనం మర్చిపోయిన పరిస్దితి.

* వారం 3: ఒక్క పాట ఫేమస్, సినిమా ఫెయిల్

3 వ వారం జూనియర్ అనే సినిమా కొద్దిగా బజ్ తెచ్చుకుంది, అది కూడా ఒక్క వైరల్ సాంగ్ వల్లే. కానీ ఆ పాట రేంజ్‌లో కూడా సినిమా ఆడలేకపోయింది. పోలీసువారి హెచ్చరిక, మై బేబీ, కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలు వచ్చినా, అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

* వారం 4: పవన్ పవర్.. కానీ ఫలితం ఫ్లాట్

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు భారీ ఓపెనింగ్స్‌తో థియేటర్లలోకి దూసుకెళ్లింది. కానీ సినిమాకొచ్చిన టాక్ మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. అదే టైమ్‌లో విడుదలైన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ ఓ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది — మౌత్ టాక్ బాగుంది, కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

* ఫైనల్ వీక్: “కింగ్డమ్” - ఓపెనింగ్ స్ట్రాంగ్, టాక్ మిక్సెడ్!

జులై నెలను క్లోజ్ చేసిన సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ మంచి టాక్ తెచ్చుకున్నా, రెండో రోజు నుంచే మిక్స్డ్ టాక్ చుట్టుముట్టింది. ఇది నిలవబోతుందా? మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

* టేస్ట్: ఆగస్టులో ఆశల బరువు

జులై బాక్సాఫీస్‌ను చూస్తే — థియేటర్స్‌కు ఏమీ కలిసిరాని నెల. కానీ ఓటీటీ ఫ్రంట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ వినిపిస్తోంది. ఇక ఆగస్టు మీదే అంతా భాక్సాఫీస్ బరువు. వార్-2, కూలీ వంటి భారీ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈసారి మాత్రం బాక్సాఫీస్‌కి నిజమైన “బ్లాస్టింగ్” కావాలి!

ఒక లైన్లో చెప్పాలంటే: జులై సినిమాలు వచ్చాయి, వెళ్లాయి. చూసే వాళ్లే థియేటర్ కు రాలేదు!

Tags:    

Similar News